MLA Lasya Nanditha Driver : నోరు విప్పిన లాస్య నందిత డ్రైవ‌ర్.. బ‌య‌ట‌కు వ‌చ్చిన న‌మ్మ‌లేని విష‌యాలు..

MLA Lasya Nanditha Driver : బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రిని క‌లిచి వేస్తుంది. తండ్రి అడుగుజాడల్లో నడిచి అతి చిన్న వయసులో ప్రజల మనసులు గెలుచుకుని మొదటిసారే ఎమ్మెల్యేగా విజయం సాధించి.. అందరి చేత శెభాష్ అనిపించుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డం ప్ర‌తి ఒక్క‌రికి కంట క‌న్నీరు పెట్టించింది. ప‌టాన్‌చెరు పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని సుల్తాన్‌పూర్ వ‌ద్ద ఔట‌ర్ రింగ్ రోడ్డుపై లాస్య నందిత కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై సంగారెడ్డి జిల్లా అడిష‌న‌ల్ ఎస్పీ సంజీవ‌రావు కీలక విషయాలు వెల్లడించారు. ప్రమాదం జ‌రిగిన స‌మ‌యంలో కారులో లాస్య నందిత‌తో పాటు ఆమె పీఏ ఆకాశ్‌(24) ఉన్నట్టుగా తెలిపారు.

అయితే.. గురువారం రోజున రాత్రి సమయంలో ఎమ్మెల్యే లాస్య నందిత.. తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో సదాశివపేటలోని దర్గాకు వెళ్లారు. అక్కడి నుంచి వెకువజామున బయలుదేరిన లాస్య నందిత.. ఇంటికి చేరుకున్నారు. అనంతరం తన పీఏతో కలిసి టిఫిన్ కోసమని.. సుమారు 4:58 గంట‌ల‌ సమయంలో శామీర్‌పేట టోల్ ప్లాజా వద్ద ఔట‌ర్ రింగ్ రోడ్డుపైకి ఎంటరయ్యారు. సుల్తాన్‌పూర్ ఎగ్జిట్ సమీపంలో ఉద‌యం 5:30 గంట‌ల స‌మ‌యంలో.. ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. అతివేగంతో వస్తున్న కారు ముందున్న టిప్పర్‌ను ఢీకొట్టటంతో.. అదుపుత‌ప్పి అదే స్పీడ్‌లో వెళ్లి రెయిలింగ్‌ను ఢీకొట్టింది.

MLA Lasya Nanditha Driver told important details
MLA Lasya Nanditha Driver

దీంతో.. కారు ముందు భాగం తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నది. కాగా.. లాస్య నందిత.. సీటు బెల్ట్ పెట్టుకున్నా అది ఊడిపోయినట్టుగా పోలీసులు తెలిపారు. స్పీడ్‌గా ఢీకొట్టటంతో.. బలంగా ముందు సీటుకు తగలటంతో.. తలభాగానికి తీవ్రగాయమైంది. దవడ భాగం విరిగిపోయి. పళ్లు కూడా చాలా వరకు విరిగాయని, పక్కటెముకలు కూడా దెబ్బతిన్నాయి. తొడభాగంలో ఎముక విరిగిపోయిందని పోలీసులు వివరించారు. ప్రమాదం జ‌రిగిన స‌మ‌యంలో లాస్య నందిత బ‌తికే ఉన్నారు. కొన ఊపిరితో ఉన్న లాస్య నందితను.. ఆస్పత్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయినట్టు ఏఎస్పీ వివరించారు.

కారు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆకాశ్ నుంచి ఇప్పటికే పటాన్‌చెరు పోలీసులు స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. మేజిస్ట్రేట్ ముందు వాగ్మూలం ఇచ్చాడు. ప్రమాదం ఎలా జరిగిందో తనకు అర్థం అవ్వట్లేదంటూ ఆకాశ్ చెప్పాడు. లాస్య భోజనం కోసం వెళ్దామని చెప్పడంతో హోటల్స్ వేతుకుంటూ వెళ్లామని అన్నాడు. దర్గా నుండి హైదరాబాద్ చేరుకుని.. లాస్య కార్లో ఉన్న తన అక్క కూతుర్ని ఇంకో కార్లో ఎక్కించామన్నాడు. తాము పఠాన్ చెరు వైపు బయలుదేరామని, యాక్సిడెంట్ టైంలో తన మైండ్ బ్లాంక్ అయ్యిందని చెప్పాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago