MLA Kunamneni Sambashiva Rao : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నాయకులు విమర్శలకి పని పెట్టారు. ఆ మధ్య కేటీఆర్.. కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడు అసలు ఆట ఉందని, అలవిగాని హామీలు ఇచ్చారంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై సీతక్క ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ నాయకులకు అంత తొందరపాటు పనికి రాదన్నారు. అధికారం పోయిందన్న బాధ వారిలో కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.ఎన్నికల ప్రచారం సమయంలో తాము ఇచ్చిన హామీలకు.. బీఆర్ఎస్ మరిన్ని జోడించి చెప్పిందని గుర్తు చేశారు. అలాంటప్పుడు వారు ఎలా ప్రశ్నిస్తున్నారని, ఇచ్చిన ప్రతి హామీని తాము నెరవేరుస్తామని వ్యాఖ్యానించారు.
ఇక అసెంబ్లీలో ఎంఎల్ఏ సాంబశివరావు కూడా కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం అని అనడం మంచిది కాదని, సిపిఐ ఎంఎల్‌ఏ కూనంనేని సాంబశివ రావు అన్నారు. కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. పాత ప్రభుత్వం ఎందుకు విఫలమైందో కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలన చేసి పని చేయాల్సి ఉంటుందన్నారు. శాసనసభ సమావేశాలు ఆరోగ్యవంతమైన, నిర్మాణ పద్ధతిలో జరగాలని, ఎంతో పవిత్రమైన సభలో మార్షల్స్ అవసరాలు లేకుండా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలన్నారు. తలసరి ఆదాయంతో పాటు అనేక ర్యాంకింగ్ నంబర్ వన్ ఉన్న సౌభాగ్య తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఎందుకు వేతనాలు ఇవ్వలేక పోయారని తెలుసుకోవాలన్నారు.
గత ప్రభుత్వం కొన్ని తప్పిదాల వల్ల అధికారానికి దూరం అయిండవచ్చని, అటువంటి తప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన పది రోజుల శాసనసభ సమావేశాలు క్వాలిటీ చర్చ కాదని, బడ్జెట్, బడ్జెట్ పద్ధులపైన ఒకే రోజులో చర్చను పూర్తి చేశారని, గత ప్రభుత్వ తరహా కాకుండా నిబంధనల ప్రకారం పాత సాంప్రదాయాలను కొనసాగిస్తూ సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూచించారు. ప్రభుత్వానికి విల్ పవర్, ప్లానింగ్, చిత్తశుద్ది ఉంటే హామీల అమలు సాధ్యమేనని కూనంనేని అన్నారు. గత వైఎస్ ఇచ్చిన అనేక వాగ్ధానాలు గెలిచాక ఆయన చివరకు అనుకున్న లక్షాలను చేరుకున్నారని గుర్తు చేశారు. ‘మీరు 65 మంది, మేము 54 మంది అని’ కెటిఆర్ చెప్పారని, తనను అటు వైపు(కాంగ్రెస్) వేశారని, అంటే బిఆర్‌ఎస్, ఎంఐఎం , బిజెపి ఒక్కటే అనే భావన కలిగేలా కెటిఆర్ చెప్పారని వివరించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…