MLA Alla Ramakrishna Reddy : ప్రస్తుతం ఏపీలో రాజకీయం జోరుగా సాగుతుంది. ఒకరిపై ఒకరు దారుణంగా విమర్శలు చేసుకుంటున్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు దారుణమైన విమర్శలు చేస్తుండగా, మరోవైపు ప్రతిపక్షంపై కూడా కొందరు ఎమ్మెల్యేలు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగానికి పెట్టింది పేరు మంగళగిరి పట్టణం. ఇక్కడ తయారయ్యే చీరలకు జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉంది. ఆగస్టు 7 చేనేత దినోత్సవం కాగా, చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ నేతన్నలతో వర్చువల్‌గా మాట్లాడారు ఇందుకోసం దేశంలోని 75 మంది చేనేత కార్మికులు, ఉత్పత్తిదారులను ఎంపిక చేశారు.
చేనేత కార్మికులు, ఉత్పత్తిదారులను ఎంపిక చేయడంలో భాగంగా ఓ టీమ్ మంగళగిరికి వచ్చింది. చేనేత కార్మికులు కోసం నిర్మిస్తున్న మగ్గం షెడ్లు, చేనేత భవన సముదాయాన్ని కేంద్ర జౌళి శాఖ నుంచి వచ్చిన టీమ్ క్షుణ్ణంగా పరిశీలించింది. చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న చేనేత నేస్తం పథకం అమలు, లబ్ది జరిగే తీరుపై అధికారులు ఆరా తీశారు. మంగళగిరిలో పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు ఉండటం, ప్రాచీన కళ, సంప్రదాయాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతుందని భావించిన టీమ్ మంగళగిరి నేతన్నను ప్రధాని మోదీతో ఇంటరాక్షన్ కోసం ఎంపిక చేయడం విశేషం. దేశంలోని మిగతా నియోజకవర్గాల తరహాలోనే మంగళగిరికి సంబంధించి చేనేతన్నలతో ప్రధాని మోదీ వర్చువల్ భేటీ గురించి కేంద్ర జౌళి శాఖ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సమాచారం అందించింది.
![MLA Alla Ramakrishna Reddy : జగన్‌ని చూసి నేర్చుకో లోకేష్.. మంగళగిరి ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్.. MLA Alla Ramakrishna Reddy strong counter to nara lokesh](http://3.0.182.119/wp-content/uploads/2023/08/mla-alla-ramakrishna-reddy.jpg)
చంద్రబాబు నాయుడు,లోకేష్‌లు చేనేత కార్మికులని ఆదుకోకపోగా, ప్రభుత్వం చేపడుతున్న చర్యలని విమర్శించడం దారుణం. జగనన్న నిర్ణయాన్ని హర్షించలేక వారు ఇలా మాట్లాడుతున్నారు. వారు ఇలా చేసాం అని గర్వంగా చెప్పుకోలేకపోతున్నరు. రాజశేఖర్ రెడ్డి గారు 2009లో ఇళ్లుతో పాటు మగ్గం షెడ్డులు నిర్మించారు. దానిని జగనన్న కొనసాగిస్తున్నారు. అంతరించిపోతున్న కళని జగన్ ప్రభుత్తం అండగా ఉంటుంది. తెలంగాణలో కేటీఆర్ చేనేతల కృషి చేస్తున్నారు. చేనేత్ భవన్‌కి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మంగళగిరిలో చేనేత భవన్‌ని కట్టి వారికి అందించేందుకు సిద్దమయ్యాం. చేనేత భవన్ షెడ్స్ వలన ఎంతో మందికి ఉపయోగం కలుగుతుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.