Mithali Raj And Shikhar Dhawan : సోషల్ మీడియాలో నిత్యం వందల కొద్ది ప్రచారాలు జరుగుతుంటాయి. అందులో ఏది నిజమో, ఏది అబద్దమో చెప్పడం చాలా కష్టం. అయితే ఇటీవల శిఖర్ ధావన్, మిథాలీల పెళ్లి గురించి జోరుగా ప్రచారాలు సాగాయి. భారత జట్టు అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ చివరిసారిగా IPL 2024లో పంజాబ్ కింగ్స్‌కు నాయకత్వం వహించాడు. అయితే, భుజం గాయం కారణంగా టోర్నీలో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. ఇంతలో, ధావన్ తన గురించి ఒక ఫన్నీ స్టేట్‌మెంట్ చేశాడు. ధావన్ మాట్లాడుతూ, ఒకప్పుడు భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో తన వివాహం గురించి పుకార్లు చాలా చర్చనీయాంశమైందంటూ తెలిపాడు.
ధావన్ కరేంగే షోలో పాల్గొనేందుకు ధావన్ తో పాటు టీమ్ ఇండియా ఉమెన్ క్రికెటర్, ఆర్సీబీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా పాల్గొంది. ఈ షో జరుగుతుండగా ధావన్ మాట్లాడుతూ.. ముందు నాకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలని అన్నాడు. ఏమిటి? అని మిథాలి అడిగితే.. సోషల్ మీడియాలో మిథాలి రాజ్ ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అనే వార్త వస్తోంది. దానికి నాకు ఆన్సర్ కావాలి అని అన్నాడు. అంతే ఆ మాటతో ఒక్కసారి మిథాలి రాజ్, ధావన్ పెద్దపెట్టున నవ్వేశారు. నిజానికి శిఖర్ ధావన్ షోకు మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ అతిథిగా వచ్చారు. ఈ సమయంలో, మిథాలీతో క్రికెట్‌తో పాటు ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా తమ పెళ్లి వార్తని పుకారుగా పేర్కొన్నాడు. ఇదో విచిత్రమైన రూమర్ అని శిఖర్ ధావన్ అన్నాడు.
ఇదే షోలో శిఖర్ ధావన్ భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ను ప్రశంసించాడు. అతను డిసెంబర్ 2022 లో ప్రమాదంలో గాయపడిన తరువాత 15 నెలల తర్వాత క్రికెట్ ఫీల్డ్‌కి తిరిగి వచ్చాడు. IPL 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు పంత్ బ్యాట్‌తో మంచి ప్రదర్శన ఇచ్చాడు. దాని కారణంగా అతను T20 ప్రపంచ కప్ 2024 కోసం టీమ్ ఇండియా జట్టులో చోటు సంపాదించడంలో విజయవంతమయ్యాడు.ఇది నేటి యువతరం చూసి నేర్చుకోవాలని అన్నాడు. మనిషి అనుకుంటే సాధించలేదనిదంటూ ఏదీ లేదని అన్నాడు. తను నా స్నేహితుడైనందుకు గర్వపడుతున్నానని తెలిపాడు.