Minister Sridhar Babu : తెలంగాణలో ఇప్పుడిప్పుడే కొత్త మంత్రులు కొలువుదీరుతున్నారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. సతీసమేతంగా పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మంత్రిగా ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో ఈ శాఖ బాధ్యతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వర్తించిన సంగతి తెలిసిందే. అయితే మొదటి సమావేశంలోనే అధికారులపై ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దని మీడియాకు లికులు ఇవ్వకూడదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐటి కంపెనీలు హైదరాబాద్ నుండి తరలి వెళ్ళిపోతున్నాయని తప్పుడు ప్రచారాలు చేయొద్దన్నారు. సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టకూడదని ఐటి సెక్రటరీని అధికారులను శ్రీధర్ బాబు హెచ్చరించారు. ఇక అసెంబ్లీలో కూడా శ్రీధర్ బాబు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ధరణి గురించి మాట్లాడుతూ …చాలా మంది పేద వారికి పోర్టల్‌లో కనిపించడం లేదు. కలెక్టర్ దగ్గరకు పోతే వేరే దగ్గరకు పొమ్మని చెబుతన్నారు. ధరణి సమస్య గురించి పరిష్కారం దొరకడం లేదు అని శ్రీధర్ బాబు అని అన్నారు.
శ్రీధర్ బాబు కామెంట్స్‌కి స్పందించిన కేటీఆర్ .. శ్రీధర్ బాబు మాటలు చూస్తుంటే రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విషయంలో వ్యవస్థ కకావికలం అయిపోందని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నట్టు చెప్పారు. ఎక్కడో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు కాని ధరణి విషయంలో రైతులకి ఒక అద్భుతమైన కానుకగా అందించాం తప్ప మరొకటి లేదు అని అన్నారు. మొత్తానికి శ్రీధర్ బాబు, కేటీఆర్ మధ్య ధరణి విషయంలో సీరియస్‌గానే డిస్కషన్ నడిచింది.