Minister Seethakka : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఎంత వాడివేడిగా సాగాయో మనం చూశాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్న చందాన చర్చ నడిచింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పలు వైఫల్యాలను ఆధారాలతో సహా సీఎం రేవంత్ రెడ్డి ఎత్తి చూపారు. రైతు బీమా, పంట గిట్టుబాటు ధర, సాగు నీటి ప్రాజెక్టులు, టీఎస్పీఎస్సీ లీకేజీ, పదో తరగతి పేపర్ల లీకేజీ లాంటి అంశాలను సభలో.. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.అందెశ్రీ కవిత్వంతో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. నిరంకుశత్వం ఎక్కువ కాలం చెల్లదంటూ బీఆర్ఎస్ సర్కార్‌పై తనదైన శైలిలో మాటల దాడి చేశారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఆదర్శవంతమైన పాలనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. అనాడు ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకు కూడా అవకాశం లేదని.. ఈరోజు సామాన్య జనాలు కూడా సీఎంను కలవచ్చని చెప్పుకొచ్చారు. తాము నిరంకుశ్వంతో పరిపాలించాలని అనుకుంటే ఏ బీఆర్ఎస్ నాయకుడ్ని మాట్లాడనిచ్చే వాళ్లం కాదన్నారు. పదే పదే గత పాలన, గత ప్రభుత్వం గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని.. వారు పూర్తిగా మాట్లాడిన తర్వాత తాను సమాధానం ఇద్దామనుకున్నానని, కానీ తన సమాధానానికి వారు తహతహలాడుతున్నారని.. అందుకే ముందుగానే మాట్లాడాల్సి వస్తోందని చెప్పారు.
గతంలో జరిగిన పరిపాలనో ఇప్పుడు అధికారపక్షంలో ఉన్నవారికి పెద్ద పాత్ర లేకపోవచ్చు కానీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు చాలామంది అప్పుడు కాంగ్రెస్ పాలనలో మంత్రులుగా పనిచేశారని గుర్తుచేశారు సీఎం రేవంత్ రెడ్డి. కడియం శ్రీహరి, గంగుల కమలాకర్, హరీష్ రావు సహా చాలామంది వైఎస్ఆర్ హయాంలో మంత్రులుగా పనిచేశారని చెప్పారు. నిజంగా అప్పుడు పాపాలు జరిగి ఉంటే.. ఆ పాపాలలో వారికి కూడా భాగస్వామ్యం ఉంది కదా అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను పొందుపరిచారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని, అది ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకేనని రేవంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ వంటి విషయంలో మాత్రం తాను ఉక్కుపాదం మోపుతానని కూడా హెచ్చరించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…