Minister Seethakka : తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ధనసరి అనసూయ అలియాస్ సీతక్క మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్‌లో వేదమంత్రోచ్ఛరణాల మధ్య ఆమె మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి ఫైల్ మీద సంతకం పెట్టారు. ఈ మేరకు ఆమె అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఇప్పటివరకు మినీ అంగన్వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ రూపొందించిన ఫైలుపై మంత్రి సీతక్క తొలి సంతకం చేశారు. ఆమె నిర్ణయంతో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సీతక్క తన ప్రత్యర్థిపై 33,700 మెజార్టీతో గెలిచి.. ప్రస్తుతం మంత్రిగా స్థానం దక్కించుకుందంటే.. ఆమె ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్నప్పుడు.. జనాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేసినప్పుడు కూడా రాని స్పందన వచ్చిందంటేనే.. ప్రజల్లో ఆమెకు ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది. అయితే.. ఆ క్రేజ్ ఊరికే రాలేదు. అడవి నుంచి జనాల్లోకి వచ్చి మూడో సారి అసెంబ్లీకి.. అది కూడా ఓ మంత్రి హోదాలో వెళ్తున్నారంటే.. ఆమె ప్రస్థానం సాఫీగా ఏమీ సాగలేదు. ఎన్నో మలుపులు, మరెన్నో ఎత్తు పల్లాలు.. ధనసరి అనసూయ అలియాస్ సీతక్కది.
రీసెంట్‌గా సీతక్క అసెంబ్లీలో తనదైన స్పీచ్‌తో ఆకట్టుకుంది. స్పీకర్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఆమె అందరిని ఆశ్చర్యపరచింది. అలానే తన జీవితం ఎలాంటిదో కూడా సీతక్క కూడా చెప్పడంతో రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకింత ఎమోషనల్‌కి గురయ్యారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తత్వం మా సీతక్కది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.