Minister Nara Lokesh : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా లోకేష్ దూసుకుపోతున్నారు. గత వైసిపి ప్రభుత్వ హయంలో టిడిపి నేతలను టార్గెట్ చేసుకుని వేధింపులకు పాల్పడిన నాయకులు అధికారుల ను హెచ్చరిస్తూ అప్పట్లోనే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు .తమపై వేధింపులకు పాల్పడిన ఎవరిని వదిలిపెట్టబోమని, అందరి పేర్లు రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నామంటూ హెచ్చరికలు చేశారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వైసీపీ నేతల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని తెలిపారు. వారిని ఎవరినీ వదిలపెట్టేది లేదని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.
గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా అరాచకాలకు పాల్పడిన వారందరూ చట్టప్రకారం శిక్ష అనుభవించక తప్పదన్నారు. రెడ్ బుక్ లో రాజకీయ నేతలతో పాటు అధికారులు కూడా ఉన్నారన్నారు. అధికారులను కూడా తాము వదిలేది లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరోసారి లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు, అధికార వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించిన ఐపీఎస్ ల పైన నివేదిక రాగానే వారి పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని , రెడ్ బుక్ లో ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టమని లోకేష్ హెచ్చరించారు.
ఇప్పటికే వైసీపీ నేతలు రెడ్ బుక్ అంశంపై పదే పదే విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని , దీనిలో భాగంగానే వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తుండగా, తాజాగా లోకేష్ రెడ్ బుక్ పై ఇలా స్పందించారు. వైసీపీలో రాసలీలలు జరుగుతున్నాయి. నిన్న, మొన్న కూడా బయటకి వచ్చాయి. వాటన్నింటి విషయంలో పూర్తి క్లారిటీ ఇస్తామని అంటున్నారు లోకేష్.