గోదారోళ్ల మర్యాదలు ఎలా ఉంటామో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో గోదారోళ్ల మర్యాదలకి సంబంధించి అనేక వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేశాయి. గోదావరి జిల్లాలకు అల్లుడిగా వెళ్తే.. ఆ భోగమే వేరే. ఇక కొత్తల్లుడు సంక్రాంతి పండగకు అత్తారింటికి వెళ్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో చాలా సందర్భాల్లో గోదారోళ్లు కొత్త అల్లుడికి మర్యాదలు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అల్లుడికి రకరకాల వంటకాలతో అత్తగారు కొసరి కొసరి వడ్డిస్తుండటం చూస్తే ఏ కుర్రాడైనా సరే.. గోదారి జిల్లాలకు అల్లుడైపోవాలని అనుకోక మానడు. గోదారోళ్లకి సంప్రదాయాలతో పాటు అరుదైన రికార్డులు సాధించడం వారికి అలవాటే. అందులో భాగంగా రాజమండ్రిలో జరిగిన ఓ నిచ్చాయతంభుల కార్యక్రమంలో పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు తరపున పెట్టిన స్వీట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
పది కాదు ఇరవై కాదు ఏకంగా 108 రకాల స్వీట్స్ పెళ్ళికూతు తరుపున వారికి పెట్టీన స్వీట్స్ చర్చనీయాంశంగా మారింది…. రాజమండ్రి మజిరా హోటల్ లో జరిగిన మున్నం, ప్రగడ కుటుంబాల ఎంగేజ్మెంట్ లో ఈ స్వీట్స్ దర్శనం ఇచ్చాయి. స్వీట్స్ లో 108 వెరైటీలు మాత్రమే కాకుండా ఇంట్లో వాడుకలో ఉండే వస్తువుల రూపంలో తయారు చేసి స్వీట్స్ ప్రత్యేకంగా అందర్నీ ఆకర్షించాయి. కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు లతో పాటు గోదావరి జిల్లాలో ఫేమస్ స్వీట్స్ రకాలు పెళ్లి కూతురికి ఇచ్చారు. వీటితో పాటు కూరగాయలు, పాత తరం నాటి రుబ్రోలు పొత్రాలు స్వీట్స్ రూపంలో చేయడమే కాకుండా పండ్లు రూపంలో తయారుచేసిన స్వీట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి..
అల్లుడికే కాదు.. కోడలికి కూడా మా మర్యాదలు అదే రేంజ్లో ఉంటాయని గోదారోళ్లు నిరూపించారు. కాబోయే కోడలిపై అత్తింటి వారు స్వీట్ల రూపంలో తమ ప్రేమనంతా గుమ్మరించారు. ఇవి చూసిన వారందరు స్వీట్లలో ఇన్ని రకాలు ఉంటాయా? ఇన్ని ఆకారాల్లో స్వీట్లు చేయొచ్చా? అని అనిపించిక మానదు. అనీష్, లేఖ ఎంగేజ్మెంట్ కోసం 108 రకాల స్వీట్లు చేయించామని.. గోదావరి జిల్లాల సంప్రదాయాన్ని రాబోయే తరాలు మర్చిపోవద్దనే ఉద్దేశంతో ఇలా చేశామని వరుడి తండ్రి తెలిపారు. ఇప్పటికే చాలా మంది సంప్రదాయాన్ని మర్చిపోతున్నారన్నారు. స్వీట్లన్నీ తామే ప్యాకేజింగ్ చేశామని వరుడి కజిన్ తెలిపారు.
https://youtube.com/watch?v=9A_92mWesQk