Manchu Manoj : మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ సినిమాలతో అలరించక చాన్నాళ్లే అవుతుంది. ఆయన ఇటీవల రెండు సినిమాలు అనౌన్స్ త్వరలోనే ఆ చిత్రాలతో ప్రేక్షకులని పలకరిస్తానని అన్నాడు. ఇక రెండో పెళ్లి చేసుకొని కూడా హాట్ టాపిక్ అయ్యాడు మనోజ్. ఈ మంచు వారబ్బాయి తన పెళ్లి తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. షోలల్లో పాల్గొనడం, ఈవెంట్స్ కు తన భార్య భూమా మౌనికా రెడ్డితో కలిసి హాజరవ్వడం చేస్తూ అందరి దృష్టి తమపై పడేలా చేస్తున్నాడు. ఇక ఆ మధ్యన ఓ బిగ్గెస్ట్ రియాలిటీ షో చేయబోతున్నట్లుగా తెలిపారు. దీంతో అందరి చూపు మనోజ్ పై పడింది. తాజాగా మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు మనోజ్.
ముంబైలో జరిగిన ముకేశ్ అంబానీ ఈవెంట్ లో తన భార్యతో కలిసి సందడి చేశాడు మనోజ్. ఇది చూసిన నెటిజన్లు మనోజ్ రేంజ్ మామూలుగా లేదుగా అంటూ కితాబిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. అది తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. మంచు మనోజ్-మౌనికా రెడ్డి దంపతులు ముంబైలో సందడి చేశారు. రిలయన్స్, జియో అధినేత ముకేశ్ అంబానీకి సంబంధించిన ఓ ఈవెంట్ లో వీరిద్దరు పాల్గొన్నారు. ముంబైలో అత్యంత లగ్జరీ మాల్ ‘జియో వరల్డ్ ప్లాజా’ని బుధవారం ప్రారంభించగా, ఈ కార్యక్రమానికి ఎందరో సెలబ్రిటీలు వచ్చారు. కానీ తెలుగు నుంచి ఆహ్వానం అందిన ఏకైక హీరో మాత్రం మంచు మనోజ్ ఒక్కడే కావడం విశేషం.
జాగా జరిగిన ‘జియో వరల్డ్ ప్లాజా’ లాంచ్ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, అలియా భట్, కరీనా కపూర్, జాన్వీ, దీపికా.. ఇలా బాలీవుడ్ స్టార్స్ తో పాటు రష్మిక మందన్న, శోభిత మరికొందరు టాలీవుడ్ తారలు కూడా కనిపించారు.మొత్తానికి ఈ ఈవెంట్‌లో మనోజ్ తన భార్యతో మెరవడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక మనోజ్ నటిస్తున్న ‘వాట్ ది ఫిష్’ సినిమా విషయానికి వస్తే.. నూతన దర్శకుడు వరుణ్ కోరుకొండ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు మనోజ్ అండ్ వెన్నెల కిశోర్ లుక్స్ తప్ప మరో అప్డేట్ లేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…