కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మల్టీ టాలెంటెడ్ అయిన మంచు లక్ష్మీ నటిగానే కాదు హోస్ట్‌గాను జడ్జిగాను తన టాలెంట్ నిరూపించుకుంది. మంచు మోహన్ బాబు కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ… మొదట కొన్ని టాక్ షోలు చేసి ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తన నటనతో మెప్పించింది కానీ.. సినిమాలు నిరాశపరచడంతో…. ఈమె నటిగా సెటిల్ కాలేకపోయింది. తనకు కలిసొచ్చిన టాక్ షోలు చేస్తూ వచ్చిన ఆమె మధ్యలో అది కూడా మానేసింది. మళ్లీ ఇప్పుడు మొదలు పెట్టింది. అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తోంది.
ఇటీవలే మోహన్ లాల్ నటించిన మాన్స్టర్ మూవీలో నటించింది.అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మీ ఎప్పటికప్పుడు తన డ్యాన్స్ స్టెప్పులతో ఇరగదీస్తూ ఉంటుంది. తాజాగా బాలయ్య బాబు సినిమాలోని మా బావ మనో బావలు అనే పాటకు స్టెప్పులను ఇరగదీసింది.బాలయ్య బాబు ఇంతకు ముందు సినిమా అఖండ లో జై బాలయ్య అనే పాటకు మంచు లక్ష్మీ డాన్స్ వేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.తాజాగా కూడా మా బావ మనోభావాలు అనే పాటకు స్టెప్పులను వేసి అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బాలయ్య బాబు అభిమానులు మంచు అభిమానులు ఆ వీడియో పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇకపోతే బాలయ్య బాబు నటించిన వీర సింహారెడ్డి సినిమా విషయం కొస్తేఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. శృతిహాసన్ బాలయ్య బాబు సరసన నటించింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా
మంచి టాక్ అందుకుంది. ఇక సినిమా విడుదలకు ముందు బాలయ్య బాబు సినిమా నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్లో ట్రెండింగ్ అయ్యాయి. చాలా మంది ఈ సినిమా పాటలకు నానా రచ్చ చేస్తూ హంగామా సృష్టిస్తున్నారు.