Manchu Lakshmi : డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మంచు మోహన్ బాబు నట వారసురాలిగా సినీ గడప తొక్కిన ఆమె విరామం లేకుండా సినీ ప్రయాణం చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా పలు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక షోలతోనూ సందడి చేస్తుంది. తాజాగా ఆహా చెఫ్ మంత్రా సీజన్ 2తో అందరినీ మరోసారి అలరించడానికి సెప్టెంబర్ 30 నుండి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేస్తోంది. 8 ఎపిసోడ్స్ కలిగిన ఈ షోను ముందుండి నడిపించడానికి మంచు లక్ష్మి వచ్చేస్తుంది.
మంచులక్ష్మీ సినిమాలు, టీవీ షోస్ తోనే కాదు సేవా కార్యక్రమాల ద్వారా కూడా అందరి మనసులు గెలుచుకుంటుంది. ఆ మధ్య 50 గవర్నమెంట్ స్కూళ్లను దత్తత తీసుకుని.. అభివృద్ధి చేస్తానంటూ ముందుకు వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న ఆమె ప్రైవేటు స్కూల్స్ కు దీటుగా ఈ స్కూళ్లను డెవలప్ చేస్తానని.. స్మార్ట్ క్లాసెస్ ప్రారంభిస్తామని చెబుతోంది. నిరుపేదల పిల్లలు చదువును మధ్యలో ఆపేయకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. మంచు లక్ష్మీ నిర్ణయం పట్ల చాలా మంది ప్రశంసలు కురిపించారు.
ఇక మంచు లక్ష్మీకి సంబంధించి తాజాగా ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. టాలీవుడ్ లో టాప్ హీరో గా ఉన్న ఆ స్టార్ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట మోహన్ బాబు. ఆయన మంచు ఫ్యామిలీకి చాలా క్లోజ్ అని దగ్గర బంధువు అని తెలుస్తుంది. అయితే మంచు లక్ష్మి ఆ సమయంలో నాకు అప్పుడే పెళ్లి వద్దని చదువుకుంటానని చెప్పి విదేశాలకు వెళ్లిపోయిందట. ఇండస్ట్రీలో ఉండే వాళ్లను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని కరాఖండిగా చెప్పడంతో అలా హీరో కొడుకుతో మంచు లక్ష్మీ పెళ్లి ఆగిపోయిందట. ప్రస్తుతం భర్త, ఓ పాపతో చాలా హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…