Mamatha : రాష్ట్రంలో పలు కీలక శాఖల్లో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న వారికి స్థానచలనం కల్పిస్తూ రేవంత్ సర్కార్ అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ప్రక్షాళన మొదలుపెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీలక అధికారులను బదిలీ చేసింది. కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా ఉన్న తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు వి.మమతను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ కు బదిలీ చేసింది. ఆమె స్థానంలో ఐఏఎస్ అధికారి అభిలాష అభినవ్ ను నియమించింది. కాగా, 2010 నుంచి 2018 వరకూ శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ గా మమత పని చేశారు.
2018 నుంచి కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా కొనసాగుతున్నారు. అలాగే, శేర్లింగపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి డిప్యుటేషన్ రద్దు చేసి ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి స్నేహ శబరీష్ కు బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు రేవంత్ రెడ్డి ఈమె గురించి ప్రస్తావిస్తూ మేము వచ్చాక ఇలా తప్పుడు పనులు చేశాక ఒక్కొక్కరి ఒళ్లు చింతపండు అవుతుందని అన్నారు. అన్నట్టుగానే ఆమెని బదిలీ చేయించి రేవంత్ తన సత్తా ఏంటో చూపించాడు.
జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి సైతం బదిలీ అయ్యారు. జీహెచ్‌ఎంసీలో శ్రీనివాస్‌రెడ్డి డెప్యూటేషన్‌ను రద్దు చేసింది. చేనేత, జౌళిశాఖ అదనపు డైరెక్టర్‌గా పాతచోటుకే చోటుకే ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక శేరిలింగంపల్లి కొత్త జోనల్ కమిషనర్‌గా ఐఏఎస్ స్నేహ శబరీష్ నియామకమయ్యారు. జీహెచ్‌ఎంసీ సూపరింటెండెంట్ ఇంజినీర్ వెంకట రమణను మూసీ నది అభివృద్ధి సంస్థ ఎస్‌ఈగా బదిలీపై పంపింది. ప్రస్తుతం మూసీ అభివృద్ధి సంస్థ ఎస్‌ఈ మల్లికార్జునుడును ఈఎన్‌సీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది.