Malla Reddy : మల్లారెడ్డి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒక సైకిల్..రెండు పశువులు..ఇవి ఆయనకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ప్రధాన ఆస్తులు. ఒకనాడు ఇంటింటికి తిరిగి సైకిల్‌పై పాలమ్మిన ఆ వ్యక్తి..ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారారు. హైదరాబాద్ గల్లీల్లో డొక్కు సైకిల్‌పై తిరిగిన ఓ సాధారణ వ్యక్తి…ఇవాళ మేడ్చల్ జిల్లాలో తనకంటూ ఓ సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నారు. అక్కడితో ఆగకుండా…పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి మంత్రి స్థాయికి ఎదిగారు. వందల ఎకరాల భూముల ఆక్రమించారని ఆరోపణలు మల్లారెడ్డిపై ఉన్నాయి.
ఇటీవల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం మల్లారెడ్డి ఆస్తులు దాదాపు రూ.100 కోట్లు. ఇది కేవలం పేపర్ మీద రాసిన లెక్కలు మాత్రమే. కానీ అనధికారికంగా ఆయన ఆస్తుల విలువ వేల కోట్లలో ఉంటుందని సమాచారం. ఆయన ఆస్తులు హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన సూరారం, దూలపల్లి, అలియాబాద్, జీడిమెట్ల, యాడారం, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.ఇవన్ని ఒక ఎత్తు ఐతే మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు మరో ఎత్తు. మొదటినుంచి మల్లారెడ్డిపై అనేక భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. చేగుంటలో 47 ఎకరాల భూమి ఆక్రమించారని మల్లారెడ్డిపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దుండిగల్ పరిధిలోనూ 20 గుంటల భూమి ఆక్రమించారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడు భద్రారెడ్డిపై దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.
మల్లారెడ్డి కాలేజీల విషయంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆయన అల్లుడు కూడా అదే బాపతు. ఏకంగా పదిహేను ఎకరాల చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేశారు. వాటిని బీఆర్ఎస్ హయాంలోనూ రెగ్యులరైజ్ చేసుకోలేకపోయారు. ఎల్ఆర్ఎస్ కట్టామని చెబుతున్నారు. ఇలాంటి చాన్స్ వస్తే కూల్చివేతలు చేయకుండా ఉంటారా ?. అయితే ఇది ప్రారంభమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా చాలా సినిమా ఉందని కాంగ్రెస్ వర్గాలు లీకులిస్తూనే ఉన్నాయి. అందుకే మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి మీద అనుచిత భాషను ప్రయోగించేవారు. తొడకొట్టేవారు. రేవంత్ ను బ్లాక్ మెయిలర్ అనేవారు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం అనుకుని రెచ్చిపోతే మొదటికే మోసం వస్తుందని మల్లారెడ్డి ఉదంతం మరోసారి నిరూపిస్తోంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…