Malaika Aurora : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన సూపర్ హిట్ చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో ఐటెం సాంగ్‌తో అదరగొట్టింది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ మైండ్ బ్లాక్ చేస్తుంటుంది. ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. నటిగా, డాన్సర్ గా ఎన్నో చిత్రాలతో అలరించింది. తన అందంతో కట్టిపడేసింది. మంచి ఫాలోయింగ్ ను సాధించుకుంది. తెలుగు ప్రేక్షకులను మలైకా ‘అతిథి’, ‘గబ్బర్ సింగ్’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించి మెప్పించింది.
బ్యూటీఫుల్ గా మెరిసి, అదిరిపోయే డాన్స్ తో అలరించింది. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ లోనే వరుస చిత్రాలతో బిజీ అవుతోంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ ఇస్తూ వస్తోంది. ఆసక్తికరంగా పోస్టులు పెడుతూ తన అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయితే మలైకా చేసే సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఒక్కోసారి జిమ్ డ్రెస్‌లో కేక పెట్టించే అందాలతో పిచ్చెక్కిస్తుంటుంది. తాజాగా మలైకా పొట్టి దుస్తులలో సూపర్ హాట్ లుక్స్‌తో కేక పెట్టించింది. మలైకా ట్రాన్సఫర్‌మేషన్ చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. ఆమె అందాలకి ఫిదా అవుతున్నారు.
మలైకా ఇంతకుముందు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. 19 ఏళ్ల పాటు సజావుగా సాగిన వివాహ బంధానికి 2016లో విడాకులతో ముగింపు పలికారు. అప్పటి నుంచి విడిగా ఉంటున్నప్పటికీ కొడుకు అర్హాన్ ఖాన్‌కు మాత్రం కోపేరెంట్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక మలైకా, అర్జున్ కొన్నేళ్ల డేటింగ్ తర్వాత 2019లో తమ రిలేషన్‌షిప్ గురించి పబ్లిక్‌గా రివీల్ చేశారు. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తుండగా.. దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటనైతే రాలేదు.