Charith : సూపర్ స్టార్ కృష్ణ నటవారసులుగా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వచ్చారు. కృష్ణ తనయులు రమేష్ బాబు, మహేష్ బాబు స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు సుధీర్ బాబు కూడా ఓ మాస్తరుగా రాణిస్తున్నాడు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా కూడా సందడి చేసేందుకు కొంత మంది సిద్ధమవుతున్నారు. మహేష్ బాబు నటించిన ‘నేనొక్కడినే’ సినిమా లో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో ఆయన తనయుడు గౌతమ్ కృష్ణ నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాతో గౌతమ్ కృష్ణ కు మంచి గుర్తింపు వచ్చింది. నేనొక్కడినే సినిమాలో గౌతమ్ పాత్ర నిడివి కాస్త ఎక్కువగానే ఉంటుంది. కనుక ప్రేక్షకుల్లో రిజిస్ట్రర్ అయ్యాడు.
ఇప్పటికి కూడా గౌతమ్ మళ్లీ ఎప్పుడు నటిస్తాడా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు తన మేనల్లుడు చరిత్ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. సర్కారు వారి పాట సినిమా లో కొన్ని కీలక సన్నివేశాల్లో నటించేందుకు గాను సుధీర్ బాబు తనయుడు అయిన చరిత్ ను ఎంపిక చేసినట్లుగా ప్రచారం చేశారు. కాని అది జరగలేదు. అయితే త్వరలో మాత్రం చరిత్ వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్. అయితే తాజాగా చరిత్ తన తండ్రితో కలిసి ఓ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఆ ఈవెంట్‌లో మహేష్ మేనల్లుడు చరిత్‌ని చూస్తుంటే రానున్న రోజులలో మంచి హీరో అయ్యే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.
చరిత్ సాయిధరమ్ తేజ్ నటించిన విన్నర్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. కథకు కీలకమైన సన్నివేశాలలో చాలా బాగా నటించాడు. ఇంటి నుండి తండ్రిపై ద్వేషంతో ఆ పిల్లాడు పరిగెడుతుంటే వెనక గుర్రాలు పరగెడుతున్నట్టు సినిమాలో గోపిచంద్ మలినేని అద్భుతంగా చూపించాడు. అయితే ఈ సినిమాలో తన కుమారుడి పరుగు మేనమామ మహేష్ బాబు లా ఉందని మురిసిపోయాడు సుధీర్ బాబు. చూస్తుంటే అతడిని త్వరలోనే ఇండస్ట్రీకి పరిచయం చేసేలా కనిపిస్తున్నాడు.