Mahesh Babu Lady Fans : థియేట‌ర్ ముందు మ‌హేష్ లేడీ ఫ్యాన్స్ హంగామా.. ర‌చ్చ మామూలుగా లేదుగా..!

Mahesh Babu Lady Fans : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఐదు ప‌దుల వ‌య‌స్సులోను ఎంతో అట్రాక్టివ్ లుక్‌లో కనిపిస్తూ అమ్మాయిల మ‌న‌సులు దోచుకుంటూ ఉంటాడు. మ‌హేష్ కి ఎంత లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక్కో సినిమాలో ఒక్కో గెట‌ప్‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తూ ఉంటాడు. మ‌హేష్ సినిమాలు రిలీజ్ అయిన‌ప్పుడు తొలి రోజు లేడి ఫ్యాన్స్ కూడా వ‌చ్చి నానా హంగామా చేస్తుంటారు. ఇటీవ‌ల మ‌హేష్ న‌టించిన బిజినెస్ మాన్ చిత్ర రీ రిలీజ్ కార్య‌క్ర‌మంలో కొంద‌రు మ‌హేష్ లేడి ఫ్యాన్స్ కారులో వ‌చ్చి హంగామా సృష్టించారు. అంతా అబ్బాయిలు ఉన్నా కూడా వారిలో కొంద‌రు మ‌హిళ‌లు తెగ హంగామా సృష్టించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ‘బిజినెస్ మేన్’ సినిమా విడుదలై సంచలన వసూళ్లను సాధించింది. మహేష్ బాబుతో ఓ సారి పని చేసిన తర్వాత.. రెండోసారి పని చేసిన దర్శకుడు హిట్ ఇవ్వడు అని ఇండస్ట్రీలో అప్పటి వరకు గట్టి నమ్మకం ఉంది. అదో బ్యాడ్ సెంటిమెంట్ అయిపోయింది కూడా. అప్పటికే అది నిజమని గుణశేఖర్, త్రివిక్రమ్ లాంటి దర్శకులు నిరూపించారు. అయితే తాను ఆ టైప్ కాదని నిరూపించిన దర్శకుడు పూరీ జగన్నాథ్. పోకిరితో అప్పటికే ఓ సారి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది.దూకుడు లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ కొట్టి మంచి ఫామ్‌లో ఉన్న స‌మ‌యంలో పూరీ, మహేష్ బాబు కాంబినేషన్ అనౌన్స్ అయింది. ఒక్కో సినిమా కోసం రెండేళ్ళు తీసుకుంటున్న మహేష్‌తో కేవలం 80 రోజుల్లోనే బిజినెస్ మేన్ సినిమా పూర్తి చేసాడు పూరీ జగన్నాథ్.

Mahesh Babu Lady Fans hungama at theatre
Mahesh Babu Lady Fans

2011 దూకుడు విడుదలైన తర్వాత బిజినెస్ మేన్ సినిమాను మొదలు పెట్టి.. 2012 సంక్రాంతికి విడుదల చేసాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు గుంటూరు కారం అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని త్రివిక్రమ్ తెర‌కెక్కిస్తుండ‌గా, ఈమూవీపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago