Mahesh Babu Lady Fans : సూపర్ స్టార్ మహేష్ బాబు ఐదు పదుల వయస్సులోను ఎంతో అట్రాక్టివ్ లుక్‌లో కనిపిస్తూ అమ్మాయిల మనసులు దోచుకుంటూ ఉంటాడు. మహేష్ కి ఎంత లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కో సినిమాలో ఒక్కో గెటప్‌లో కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటాడు. మహేష్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు తొలి రోజు లేడి ఫ్యాన్స్ కూడా వచ్చి నానా హంగామా చేస్తుంటారు. ఇటీవల మహేష్ నటించిన బిజినెస్ మాన్ చిత్ర రీ రిలీజ్ కార్యక్రమంలో కొందరు మహేష్ లేడి ఫ్యాన్స్ కారులో వచ్చి హంగామా సృష్టించారు. అంతా అబ్బాయిలు ఉన్నా కూడా వారిలో కొందరు మహిళలు తెగ హంగామా సృష్టించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ‘బిజినెస్ మేన్’ సినిమా విడుదలై సంచలన వసూళ్లను సాధించింది. మహేష్ బాబుతో ఓ సారి పని చేసిన తర్వాత.. రెండోసారి పని చేసిన దర్శకుడు హిట్ ఇవ్వడు అని ఇండస్ట్రీలో అప్పటి వరకు గట్టి నమ్మకం ఉంది. అదో బ్యాడ్ సెంటిమెంట్ అయిపోయింది కూడా. అప్పటికే అది నిజమని గుణశేఖర్, త్రివిక్రమ్ లాంటి దర్శకులు నిరూపించారు. అయితే తాను ఆ టైప్ కాదని నిరూపించిన దర్శకుడు పూరీ జగన్నాథ్. పోకిరితో అప్పటికే ఓ సారి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది.దూకుడు లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ కొట్టి మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో పూరీ, మహేష్ బాబు కాంబినేషన్ అనౌన్స్ అయింది. ఒక్కో సినిమా కోసం రెండేళ్ళు తీసుకుంటున్న మహేష్‌తో కేవలం 80 రోజుల్లోనే బిజినెస్ మేన్ సినిమా పూర్తి చేసాడు పూరీ జగన్నాథ్.
![Mahesh Babu Lady Fans : థియేటర్ ముందు మహేష్ లేడీ ఫ్యాన్స్ హంగామా.. రచ్చ మామూలుగా లేదుగా..! Mahesh Babu Lady Fans hungama at theatre](http://3.0.182.119/wp-content/uploads/2023/08/mahesh-babu-lady-fans.jpg)
2011 దూకుడు విడుదలైన తర్వాత బిజినెస్ మేన్ సినిమాను మొదలు పెట్టి.. 2012 సంక్రాంతికి విడుదల చేసాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా, ఈమూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.