Mahesh Babu : రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కూమారుడు అనంత్ పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. ఎంతో మంది తారలు వచ్చి వేడుకలో సందడి చేశారు. ఈ వేడుకకు దేశ, విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలను ఆహ్వానించారు. దీంతో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ కు సెలబ్రిటీలు క్యూ కట్టారు. అయితే టాలీవుడ్ నుంచి విక్టరీ వెంకటేశ్‌తో పాటు రామ్ చరణ్ – ఉపాసన దంపతులు, అఖిల్ అక్కినేని, సూపర్ స్టార్ మహేశ్ బాబు దంపతులు తదితరులు హాజరై సందడి చేశారు. అయితే ఈ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు ప్రిన్స్ మహేశ్ బాబు. తన సతీమణి నమ్రతతో పాటు కూతురుతో కలిసి సందడి చేయడం ఆకట్టుకుంది.
మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా కోసం సరికొత్తగా మేకొవర్ అయ్యారు. మహేష్ లుక్ పూర్తిగా మార్చేశారు.. లాంగ్ హెయిర్‌తో అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. ప్రస్తుతం ఆషాడ మాసం కొనసాగుతోంది. ఆషాఢ మాసం జూన్ 23 నుంచి జూలై 21 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో శుభకార్యాలతో పాటు ఎలాంటి పనులు ప్రారంభించడానికి ఎవరూ ఆసక్తి చూపరు. జక్కన్న కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారట. అందుకే ఈ సమయంలో తన కొత్త సినిమా ముహూర్తం పెట్టకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నారట.
రాజమౌళి సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపించి తెగ సందడి చేయనున్నాడని టాక్. అంబానీ పెళ్లి నుంచి రాకుమారుడిలా కనిపిస్తున్న మహేష్ లుక్ ని అభిమానులు అంతర్జాలంలో వైరల్ గా షేర్ చేస్తున్నారు. అసలు నిజాం కింగ్ మహేశ్ బాబే అంటూ పోస్టులు పెట్టారు. మాములుగానే మహేష్ చాలా అందగాడు. ఆ విషయం ఎవరిని అడిగినా చెబుతారు. కానీ ఇప్పుడాయన రాజమౌళి సినిమా కోసం మేకోవర్ అవుతున్న లుక్‌లోనే ఈ వేడుకకు హాజరవడంతో.. ఫ్యాన్స్, నెటిజన్లు ఆయన ఫొటోలను, వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు.