Madhavi Latha Kompella : లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీ 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా శనివారం విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ నేత వినోద్ తావడే, అర్జున్ పాండేతో కలిసి పలు రాష్ట్రాలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకుగానూ 9 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఇందులో శుక్రవారం బీజేపీలో చేరిన ఎంపీ బీబీ పాటిల్ పేరు ఉండటం విశేషం. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లపై పార్టీ మరోసారి నమ్మకం ఉంచింది. రెండు రోజుల కిందట బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిలో నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్ కు అదే స్థానం నుంచి బరిలో నిలుపుతోంది బీజేపీ.
మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతుండగా.. ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ స్థానం నుంచి మాధవీలతను బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.అయితే అసద్ కి మాధవీ లతని పోటీగా ప్రకటించడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ విరించి హాస్పిటల్స్ చైర్ పర్సనే కొంపెల్ల మాధవీ లత. ఈమె రిలిజీయస్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. హైదరాబాద్ యాకుత్‌పురా నియోజకవర్గం సంతోశ్‌నగర్‌లో పుట్టి పెరిగిన మాధవీలత ఓయూలో ఉన్నత విద్యను అభ్యసించారు. భరతనాట్య నృత్యకారిణి, ఆర్టిస్ట్, ఫిలాసఫర్, ఎంటప్రిన్యూర్. విరించి గ్రూఫ్ ఫౌండర్ కొంపెల్ల విశ్వనాథ్‌ను 2001లో వివాహం చేసుకున్నారు. కొంపెల్ల విశ్వానాథ్, మాధవీ లత దంపతులకు ముగ్గురు సంతానం.
విరించి ఆస్పత్రి సీఎండీగా మాధవీ లత ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈమె లతామా ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ కూడా. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలరు. రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం అడ్డా. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో అసదుద్దీన్ వరుసగా ఎంపీగా గెలిచారు. అంతకు ముందు 1984 నుంచి 2004 వరకు ఆయన తండ్రి సుల్తాన్ సలాఉద్దీన్ ఓవైసీ ఆరు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు.అయితే.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసదుద్దీన్‌కు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎదురులేని నేతగా ఓవైసీని గట్టి దెబ్బ కొట్టాలన్నది బీజేపీ ప్లాన్. అందు కమలం పార్టీ మాధవీ లతని బరిలోకి దింపబోతుంది. ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.