Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన సినిమా విడుదలైందంటే థియేటర్లలో పెద్ద పండగే. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్.. కొన్నాళ్లపాటు తన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. పవన్ చేతిలో ఇప్పుడు మూడు చిత్రాలు ఉండగా..ఆ సినిమాలు రిలీజ్ కావడానికి మరికొంత సమయం పట్టనుంది. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ 56వ పుట్టినరోజు. అయితే వరదల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉండడంతో పవన్ రాజకీయాలకి దూరంగా ఉన్నారు. అయితే ఆయన అభిమానులు మాత్రం పవన్ బర్త్ డే వేడుకలు జరుపుతూ వరదలలో నష్టపోయిన వారికి తమ వంతు చేస్తున్నారు.
భారీ వర్షాలతో అకస్మాత్తుగా విరుచుకుపడిన వరదలు ముంచెత్తడంతో పవన్ కల్యాణ్ తన అభిమానులకు, పార్టీ శ్రేణులకు వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునివ్వడంతో పూర్తిగా ఆవైపుగా దృష్టిసారిస్తున్నారు ఆయన అభిమానులు, పార్టీశ్రేణులు.. డిప్యూటీ సీఎంగా, మంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు అంబరాన్ని అంటేలా చేయాలనుకున్న అభిమానులు కొంత నిరాస పడినా తన అభిమాన నేత సూచనల మేరకు వరద ఫ్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు ఏపీలో భారీ స్థాయిలో నిర్వహించేందుకు జనసేన పార్టీ నాయకులుతోపాటు కూటమి నేతలు ప్లాన్ చేశారు.. అయితే భారీ వర్షాలు, వరదల కారణంగా భారీ వేడకలను విరమించి పూర్తిగా బాధితులకు అండగా నిలుస్తున్నారు.
వరద బాధితులకు ఆహారం, తాగునీరు, చిన్నారులకు, రోగులకు పాలు, బ్రెడ్లు పంపిణీ ఇలా తలో పనిని పంచుకుంటూ విజయవాడ వైపు ముందుకు కదులుతున్నారు.. వరద ప్రభావం పెద్దగా లేని ప్రాంతాలకు చెందిన పవన్ కల్యాణ్ అభిమానులు నిత్యావసర సరుకులు పెద్ద ఎత్తున వరద ప్రభావిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఇక ఇదిలా ఉంటే ఓ టీవీ ఛానెల్ పవన్ బర్త్ డే సందర్భంగా ఓ ఈవెంట్ నిర్వహించి ఆ కార్యక్రమానికి పవన్ సోదరి మాధవిని గెస్ట్‌గా పిలిచారు. ఆ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఆయన చెల్లిగా పుట్టడం నా అదృష్టం. ఆయన చాలా గొప్ప వ్యక్తి. అంతకు మించి ఏం చెప్పను. ఎలక్షన్స్ లో 90 శాతం మాత్రమే పవన్ గెలుస్తాడని అనుకున్నాను. కాని 100 శాతం వస్తుందని అస్సలు ఊహించలేదని పేర్కొంది మాధవి.