Liger Movie : భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లైగర్. విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలలో పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా ఆగస్ట్ 25న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా మొదటి షో నుంచే మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుని డిజాస్టర్ అయ్యింది. దాదాపుగా థియేట్రికల్ రన్ పూర్త చేసుకున్న ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకొచ్చే ప్లాన్స్ చేస్తున్నారు మేకర్స్. ఓటీటీ అనేవి థియేటర్లలో సినిమాలు నడిచే కాలాన్ని తగ్గించేస్తున్నాయి. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లకు నష్టం కలుగుతుంది.
అందుకే సినిమా విడుదలయిన 8 వారాల వరకు ఓటీటీలో విడుదల చేయకూడదని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. కాని లైగర్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉండడంతో ఈ చిత్రాన్ని వెంటనే ఓటీటీలోకి తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్‌లో ఈ సినిమా సెప్టెంబర్ 30న స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఇప్పటికే లైగర్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. అయితే అనుకున్న సమయంకంటే ముందుగానే స్ట్రీమింగ్ చేయడం కోసం రూ.10 కోట్లు అదనంగా ఆఫర్ చేస్తోందట ఈ సంస్థ.
ఇక లైగర్ దారుణంగా ఫ్లాప్ కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన జనగణమన సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకోగా.. ఓ రూ.20 కోట్ల వరకు ఖర్చు కూడా అయ్యిందని టాక్. అయితే లైగర్ పరాజయం తర్వాత ఈ సినిమా బడ్జెట్ పరంగా వర్కౌట్ కాదని దర్శక నిర్మాతలు ప్రస్తుతానికి సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. చూస్తుంటే కొద్ది రోజుల పాటు పూరీ అండ్ టీం సినిమాల జోలికి వెళ్లకుండా ఫ్యూచర్ ప్లాన్స్‌పై దృష్టి సారించనున్నట్టు అర్ధమవుతుంది.