Leo Movie : కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ లియో . అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అవుతుంది. అయితే లియో తెలుగు వెర్షన్‌పై హైదరాబాద్ సివిల్ కోర్టు స్టే విధించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. లియో మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ పై స్టే విధిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 20 వరకు లియో చిత్రాన్ని విడుదల చేయకూడదని ఈ మేరకు సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్ర టైటిల్ విషయంలో ఉన్న చిక్కుల నేపథ్యంలోనే సివిల్ కోర్టు ఆదేశాలను జారీ చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో నిర్మాత స్పందించారు.
మూవీ తెలుగు రైట్స్ కొన్న సితార నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇస్తూ … అక్టోబర్ 19 ఉదయం ఏడు గంటల షోతో ‘లియో’ రిలీజ్ అవుతుంది. తెలుగులో టైటిల్ విషయంలో ఓ చిన్న సమస్య వచ్చింది. లియో టైటిల్ ని తెలుగులో మరొకరు రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళు మమ్మల్ని సంప్రదించకుండా నేరుగా కోర్ట్ కి వెళ్లారు. ఆ విషయం నాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. టైటిల్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నాం. సమస్య పరిష్కారమవుతుంది. లియో విడుదలలో ఎటువంటి మార్పు ఉండదు. అక్టోబర్ 19నే తమిళం తో పాటు తెలుగులో లియో రిలీజ్ అవుతుంది” అని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ చిక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధిగమించేసింది. క్రాకర్స్ , డ్రమ్స్ తీయండి.. ఇది పెద్ద వేడుక చేసుకునే సమయం..లియో తెలుగు విడుదల విషయంలో ఏర్పడ్డ సమస్యలన్నీ పరిష్కరించబడ్డాయి. లియో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. వేడుకలను థియేటర్లలో ఘనంగా ప్రారంభిద్దాం.. అంటూ ట్వీట్ చేశారు మేకర్స్.
‘లియో’ సినిమా విషయానికొస్తే.. ‘విక్రమ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం ‘మాస్టర్’ తర్వాత విజయ్ లోకేష్ కాంబినేషన్లో ‘లియో’ వస్తుండడంతో ఈ చిత్రంపై కోలీవుడ్లో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో ‘లియో’ అడ్వాన్స్ బుకింగ్స్ వన్ మిలియన్ డాలర్ మార్క్ ని అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఇందులో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్ యాక్షన్ కింగ్ అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీ ఖాన్, మిస్కిన్ ఇతర కీలక పాత్రలు పోషించగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.