Lalitha Jewelry Kiran Kumar : లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నా షో రూమ్ లో ఎవరు బంగారం కొనమని నేను ఎప్పుడూ చెప్పనని నా షాప్ కి వచ్చి మీకు నచ్చిన నగ ఫోటో తీసుకొని బయట కంపేర్ చేసి నచ్చితే కొనమని మాత్రమే చెబుతా అని కిరణ్ అంటుంటారు. డబ్బులు ఊరికే రావు అనే డైలాగ్‌తో ఆయన చాలా ఫేమస్ అయ్యారు. దేశవ్యాప్తంగా తన షోరూమ్స్ విస్తరింప చేయాలన్నదే నా లక్ష్యమని కిరణ్ కుమార్ వెల్లడించారు అమలాపురంలో సినిమా రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జ్యుయలరీస్ 52వ షోరూమ్‌ను మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ చింత అనురాధ చేతుల మీదుగా శనివారం ప్రారంభమైంది.
లలిత జువెలరీస్ అధినేత కిరణ్ కుమార్ మాట్లాడుతూ అతి తక్కువ తరుగు మజూరి లేకుండా నాణ్యమైన మేలిమి బంగారంతో చేసిన ఆభరణాలు, డైమండ్స్ అధిక కలెక్షన్స్ తో అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయని అన్నారు. కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంఎల్‌సి కుడుపూడి సూర్యనారాయణ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి, తుని నియోజకవర్గ వైసిపి పరిశీలకుడు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ రుద్రరాజు నానీరా, మున్సిపల్ కౌన్సిలర్ దొంగ నాగసుధారాణిచిన్న తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో మాట్లాడిన కిరణ్ కుమార్.. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి అని చెప్పారు.
ఏవో మాటలు చెప్పి మిమ్మల్ని బంగారం కొనేలా చేస్తారు. చెక్ చేసుకొని మీరు తీసుకోండి. మీకు మూడు రెట్లు ఎక్కువ వేసి అమ్ముతున్నారు. ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఇస్తానన్నది మోసం. అమ్మేవాడికి డబ్బు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లోనే వచ్చేసింది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అమలాపురంలో పర్టిక్యులర్‌గా అది విన్నాను కాబట్టి ఈ విషయం మీకు చెబుతున్నాను అంటూ కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. ఇక కిరణ్ కుమార్ సినిమాలు, రాజకీయంలోకి రానని ఈ జన్మకు తాను ఈ వ్యాపార రంగంలోనే కొనసాగుతానని చెప్పారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…