KTR : బీఆర్ఎస్ ఓటమి తర్వాత కార్యకర్తలు, నాయకలు తీవ్ర విచారంలో ఉన్న విషయం తెలిసిందే. వారిని ఉత్తేజపరిచే ప్రయత్నం చేస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్. సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన మీటింగ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్.. ఆ రెండింటిని ప్రజలు వదులుకోరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. ఇది స్వల్ప కాలం మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, నిర్మాణాత్మక ప్రతిపాక్ష పాత్ర పోషిస్తామని కేటీఆర్ తెలిపారు.
అనుకోని ఫలితాలను చూసి నిరాశపడాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పోరాటాల నుంచి వచ్చిన పార్టీ అని.. ఒడిదొడుకులు కొత్తేమీ కాదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజా గొంతుకై పోరాడుతామని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తాం. సిరిసిల్లలో ఓటుకు డబ్బులు, మందు పంచనని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను అని కేటీఆర్ తెలిపారు.ప్రస్తుతం ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని, ఇది స్వల్ప కాలం మాత్రమే ఉంటుందన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన మాట్లాడుతామని కేటీఆర్ చెప్పారు. పవర్ పాలిటిక్స్‌లో అధికారం రావడం పోవడం సహజం. ప్రజలు మనకు కూడా రెండు సార్లు అవకాశం ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తామన్నారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. 64 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతోంది. బీజేపీకి 8, ఎంఐఎంకు 7 సీట్లు వచ్చాయి. కాగా, గురువారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.