KTR : హైదరాబాద్ లోని బండ్లగూడ జాగీర్ వద్ద కారు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ యువకుడు కారు వేగంగా నడిపి ఇద్దరి మృతికి కారణం అయ్యాడు. మసాబ్ ట్యాంకుకు చెందిన బబ్రుద్దీ్న్ ఖాన్ అనే విద్యార్థి తన బర్త్ డే వేడుకలు జరుపుకునేందుకు మరో ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి మొయినాబాద్ బయలుదేరాడు. ఈ క్రమంగా కారును అతివేగంగా నడిపి ఇద్దరి మృతికి కారణమయ్యాడు. సన్ సిటీ వద్ద వాకింగ్ కు వెళ్తన్న శాంతినగర్ కు చెందిన తల్లీకూతుళ్లు అనురాధ, మమతతో పాటు మరో ఇద్దరిని కారు వేగంగా ఢీ కొట్టింది. దీంతో అనురాధ, మమత అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన కవిత, ఇంతియాజ్ లను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు.
మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో కారు వేగంగా వచ్చి వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో మహిళలంతా రోడ్డుపక్కనే ఉన్న ముళ్లపొదల్లో ఎగిరిపడ్డారు. రెప్పపాటులో ముగ్గురూ గాలిలోకి ఎగిరి పొదల్లోపడ్డారు. కారు అదుపు తప్పడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రమాదానికి కారణమైన బబ్రుద్దీన్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఓ ప్రైవేట్ కాలేజీలో బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని ఉరితీయాలంటూ నెటిజన్స్ డిమాండ్స్ చేస్తున్నారు. వాకింగ్ చేస్తున్నవారిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని బాధపడుతున్నారు.
అయితే ఈ ఇష్యూపై తాజాగా కేటీఆర్ స్పందించారు. ప్రజలు ప్రజా రవాణా వాడాలని ఆయన తెలిపారు. విదేశాలలో కూడా మిలియనర్స్ కూడా ప్రజా రవాణా వాడతారని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన వాకింగ్ చేసుకుంటూ పోతున్న వారిని ఓ దరిద్రుడు వచ్చి గుద్దిండు.ఫుట్ పాత్‌లు చూసుకోకుండా ఇలా డ్రైవ్ చేసుకుంటూ పోతే అభద్రతా బావం వస్తుంది. మెట్రో ఇప్పటి వరకు ఐదు లక్షలకొ పైగా వాడుతున్నారు.15లక్షలు మన టార్గెట్ అని కేటీఆర్ అన్నారు. ఆర్టీసీ, మెట్రో, ఆటోలని కలిపి ఓ ఇంటిగ్రేటెడ్ కార్డ్ తేవాలని అనుకుంటున్నాం అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.