KTR : పదేళ్లుగా తెలంగాణ సీఎం అధికారిక నివాసంగా ఉన్న ప్రగతి భవన్‌లో మార్పులు చేర్పులు జరగడం మనం చూసాం .ఇప్పటికే దీన్ని అంబేద్కర్ ప్రజా భవన్‌గా పేరు మార్చారు. సామాన్యులకి కూడా ఆ ప్రజాభవన్‌లోకి ప్రవేశం ఉంటుందని ప్రకటించారు. అందులో భాగంగా ప్రగతి భవన్ వద్ద మార్పులు చేర్పులు చేసారు . తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన విధులు నిర్వహించేందుకు ఈ భవనాన్ని నిర్మించారు. అంత వరకు ఇక్కడ అధికారుల క్వార్టర్స్ ఉండేది. దాన్ని తొలగించి భవనాన్ని నిర్మించారు. దానికి ప్రగతి భవన్ అని పేరు పెట్టారు. దీన్ని 2016 నవంబరు 23న ప్రారంభించారు. నియోక్లాసికల్, పల్లాడియన్ శైలిలో భారతీయ వాస్తుశిల్పి హఫీజ్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ను నిర్మించారు. ఈ భవనం బ్రిటీషు రెసిడెన్సీ, ఫలక్‌నుమా ప్యాలెస్ వంటి కట్టడాలను పోలి ఉంటుంది.
2016 మార్చిలో ప్రగతి భవన్ నిర్మాణాన్ని ప్రారంభించారు. దీని కోసం 38కోట్లు ఖర్చు పెట్టారు. దీన్ని ముంబైకి చెందిన షాపూర్జీ పల్లోంజి నిర్మాణ సంస్థ నిర్మాణ కాంట్రాక్టర్. 9 ఎకరాల ఈ ప్రగతి భవన్ నిర్మించారు. ఇందులో ముఖ్యమంత్రి నివాసం, ముఖ్యమంత్రి కార్యాలయం, జనహిత పేరుతో సమావేశ మందిరం ఉన్నాయి. జనహిత అనేది 1000 మందికి పైగా కూర్చునే సామర్థ్యంతో కూడిన మీటింగ్ ఏరియా. తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా 2017 ఫిబ్రవరి 17న దీన్ని ప్రారంభించారు. ఇక్కడ ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చేవారితో సమావేశమవుతుంటారు. ఇందులో కార్యదర్శులు, కలెక్టర్లు, అధికారిక సమీక్షా సమావేశాలు, ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు.

అయితే ఇనుప కంచెలపై కేటీఆర్ స్పందిస్తూ.. ఎవరు వేసారు 2012లో కిరణ్ కుమార్ రెడ్డి వేసారు.వాళ్లు వేసిన కంచెలు వారే వేసి ఇప్పుడు అవి తొలగించి ఆ ఇల్లుని భట్టి అన్నకి ఇచ్చారు అని అన్నారు కేటీఆర్. సీఎం ఉండడం లేదు కాబట్టి పెద్దగా సెక్యూరిటీ అవసరం లేదు. దానికి మేము ఏదో గోడలు పగలగొట్టినం అని ఏదో గొప్పగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ప్రజలు నమ్మరు. వాళ్లే వేసి వాళ్లే తీయడాన్ని ప్రజలు నమ్మరు అని కేటీఆర్ పంచ్‌లు వేశారు.