KTR : ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎంత రసవత్తరంగా మారుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు.ఏపీలో ఆయకట్టులో లేని ప్రాజెక్టులు నిర్మాణానికి కేసీఆర్ సహకారం ఉందని తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కెఆర్‌ఎంబికి సాగునీటి ప్రాజెక్టుల్ని అప్పగించేది లేదని తీర్మానం సందర్భంగా ఏపీ అసెంబ్లీలో కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతూ జగన్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని తెలంగాణ అసెంబ్లీలో ప్రదర్శించారు. కేసీఆర్, జగన్ మధ్య ఉన్న సంబంధాల వల్లే తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టుల్ని అప్పగించడానికి తాము సిద్ధం లేమని అసెంబ్లీ ప్రకటించారు. నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత బిఆర్ఎస్ నాయకులు అక్కడకు వెళ్లాలన్నారు.
కృష్ణా జలాలను ఏపీకి ధారాదత్తం చేశారంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్, జగన్ లు అనేక సార్లు ప్రగతి భవన్ లో కలుసుకున్నారని, బిర్యానీ తిని కృష్ణా నీటిని ఏపీకి తరలించారని ఆయన ఆరోపించారు. ఎంత నీటిని తరలించారో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సరిహద్దులు దాటి కృష్ణా నీటిని ఏపీకి తరలించారని ఆయన ఆరోపించారు. జగన్, కేసీఆర్‌లు ఏకాంత చర్చలు జరిపి నీటిని ఏపీకి తరలించుకుపోయారన్నారు. ఈ సందర్భంగా జగన్ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ను ప్రశంసిస్తూ ప్రసంగించిన వీడియోను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రదర్శించారు.
అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి.. జగన్‌కి సంబంధించిన వీడియో ప్రదర్శించిన తర్వాత ఇప్పుడు కేటీఆర్.. జగన్ తెలంగాణకి చాలా సాయం చేసినట్టు చెప్పాడని ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇటీవల బీఆర్ఎస్ నాయకులు ఎక్కువగా జగన్ మంత్రం చదువుతున్నారని వారి పద్దతి ఏం బాగోలేదు అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ రోజు రోజుకి మరింత ఆసక్తికరంగా మారుతుంది.