KTR : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సీఎం రేవంత్ లక్ష్యంగా బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలు పైన స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలవిగానీ హామీలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆయన్ను తామెందుకు వదిలిపెడతామన్నారు. తాము చేసిన ప్రతీ అప్పుకు ఆడిట్ రిపోర్ట్ ఉందన్నారు. వారు చూసుకోక పోతే తమకేం సంబంధమని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సాగించేందుకు చేసుకోవలసిన సర్దుబాట్ల నేపథ్యంలో తాము ఆరు నెలల వరకు వేచి చూస్తామని, మౌనంగా ఉంటామని ఆ తర్వాత పాలన సాగించకపోతే ప్రశ్నిస్తామని కేటీఆర్ మీడియా ముఖంగా చెప్పిన విషయం తెలిసిందే.
అయితే ఆ విషయాన్ని పక్కన పెట్టిన కేటీఆర్ అప్పుడే అక్కసు వెళ్లగక్కుతున్నారు.కాంగ్రెస్ పార్టీ పాలన మొదలుపెట్టిన తొలినాళ్లలోనే అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చారంటూ, ఎలా వాటిని అమలు చేస్తారో చూస్తానంటూ కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి పాలనను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు ఎన్నికల సమయంలో రేవంత్ చెప్పిన ప్రతి మాటకు రికార్డు ఉందని, ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని, రాగానే పెన్షన్ 4000 ఇస్తామని చెప్పారని, పది రోజులు ఆగండి 15000 రైతు భరోసా ఇస్తామన్నారని కానీ ఇంతవరకు ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
ఏపీలో పోల్చితే తెలంగాణలో హుందాతనం కనిపిస్తుంది. రాజకీయ నాయకులు విద్వేషపూరితంగా ఉండకుండా కలిసి కట్టుగా కనిపిస్తున్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ని రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పరామర్శించారు. అలానే తాజాగా అసెంబ్లీ పదవి కోసం నామినేషన్ వేస్తున్న సమయంలో కేటీఆర్, రేవంత్ రెడ్డి, భట్టి, అందరు కలిసి మెలిసి కనిపించడం ఆకర్షించింది. అంతేకాదు రేవంత్ రెడ్డిని కేటీఆర్ సరదాగా ఆట పట్టించడం కూడా కనిపించింది. తాము రాజకీయంగా ప్రత్యర్ధులమే తప్ప శత్రువులమి కాదు అన్నట్టుగా అక్కడి వాతావరణం కనిపించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…