KTR : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌దవిపై తొలిసారి స్పందించిన కేటీఆర్.. ఢిల్లీనే శాసిస్తున్నాడంటూ కామెంట్..

KTR : తెలుగు రాష్ట్రాల‌లో ఏపీ రాజ‌కీయాలు ఎంత ర‌స‌వత్త‌రంగా మారాయో మ‌నం చూశాం. తెలంగాణ‌లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుపొంద‌గా, ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అతి పెద్ద విజ‌యాన్ని సాధించింది. అయితే తెలంగాణ‌లో కొన్ని అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయంటూ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు కేటీఆర్. సింగ‌రేణికి బొగ్గు గనులు కేటాయించకుండా కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. సింగరేణి రక్షణ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. బీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఏం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారని… కానీ ఈరోజు ఏపీలో 16 స్థానాలు గెలిచిన టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపగలిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

16 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో మనం నిర్ణయాత్మకంగా ఉంటామని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఈరోజు బీఆర్ఎస్‌కు లోక్ సభ స్థానాలు వస్తే కేంద్రంలో నిర్ణయాత్మక స్థానంలో ఉండేవారమన్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి 8, కాంగ్రెస్‌కు 8 లోక్ సభ స్థానాలు ఉన్నాయని గుర్తు చేశారు.బొగ్గు గనులను వేలం పెట్టవద్దని నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారన్నారు. కానీ ఇప్పుడు బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనాలని కిషన్ రెడ్డి చెబితే… రేవంత్ రెడ్డి పాల్గొంటానని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. వేలం లేకుండా సింగరేణికి గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో ఒడిశాలో రెండు గనులను నైవేలీ లిగ్నైట్ కంపెనీకి, గుజరాత్‌లోని గనులను అక్కడి ప్రభుత్వరంగ సంస్థలకు వేలం లేకుండా కేటాయించారని గుర్తు చేశారు. తమిళనాడులోనూ ప్రభుత్వరంగ సంస్థలకు వేలం లేకుండా కేటాయించారన్నారు.

KTR first time comments on deputy cm pawan kalyan
KTR

దేశంలోని పలు రాష్ట్రాల్లో వేలం లేకుండానే గనులను అప్పగించారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ, సింగరేణికి మాత్రం బొగ్గు గనులు కావాలంటే వేలంలో పాల్గొనాలంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. అదానీకి బైలదిల్లా గని కేటాయించడం వల్ల విశాఖ ఉక్కు నష్టాల్లోకి వెళ్లిందని.. నష్టాల్లోకి వెళ్లింది కాబట్టి విశాఖ ఉక్కు అమ్ముతున్నామని కేంద్రం చెప్పిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే కేటీఆర్ త‌న కామెంట్స్‌లో టీడీపీ ప‌వ‌ర్‌ని పొగొడుతూ ఇన్‌డైరెక్ట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని కూడా ప్ర‌శంసించార‌ని జ‌న‌సైనికులు చెబుతున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ల‌నే కూట‌మి ప్ర‌భుత్వం పెద్ద విజ‌యం సాధించ‌డం మ‌నం చూశాం.

Share
Shreyan Ch

Recent Posts

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

13 hours ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

20 hours ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

2 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

2 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

2 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

3 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

4 days ago