KTR : తెలంగాణ నూతన స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎంపికైన విషయం తెలిసిందే. ఎంపీటీసీ నుంచి శాసనసభాధిపతి వరకు ఎదిగిన స్పీకర్ ప్రసాద్ కుమార్ రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారని వెల్లడించారు. 2012 నుంచి 14 వరకు చేనేత జౌళి శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో సిరిసిల్లకు వచ్చారని, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేశారని చెప్పారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌కు అభినందనలు . మాజీ స్పీకర్లు మధుసూదనా చారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి నెలకొల్పిన సాంప్రదాయాలను, కాపాడిన విలువలను పరిరక్షిస్తారని ఆకాంక్షిస్తున్నాని చెప్పారు.
దురదృష్ట వశాత్తు గాయపడటంతో ఆయన సభకు రాలేకపోయారని చెప్పారు. ఈ సభ అందరిదని, ప్రతి సభ్యుడి హక్కులను కాపాడేలా, ప్రజల తరఫున మాట్లాడేవారి గొంతును వినిపించేలా బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తి్స్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఎన్నిక ఆ పదవికే వన్నె తెచ్చిందని మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజా సమస్యలు, వారి హక్కులపై చర్చిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. శాసన సభలో మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తారని స్పీకర్ పై తనకు పూర్తి నమ్మకం ఉన్నట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అనంతరం ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
2012 నుంచి 14 వరకూ చేనేత జౌళి శాఖ మంత్రిగా నేను పని చేసిన సమయంలో మీరు సిరిసిల్లకు వచ్చారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశారు అని కేటీఆర్ అన్నారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి స్పీకర్ గా ఎన్నికైన మీ రాజకీయ ప్రస్థానం స్ఫూర్తి దాయకమని సీఎం అన్నారు. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఎన్నిక ఆ పదవికే వన్నె తెచ్చిందని మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజా సమస్యలు, వారి హక్కులపై చర్చిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.