KTR : ఎగ్జిట్ పోల్స్‌పై కేటీఆర్ గుస్సా.. త‌ప్ప‌యితే క్ష‌మాప‌ణ‌లు చెప్తారా అంటూ ఫైర్

KTR : తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి. అయితే ఈ సారి ఎవ‌రు అధికారం ద‌క్కించుకోనున్నారు, ఎవ‌రు జెండా పాత‌నున్నారు అనే విష‌యంపై జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తంచేస్తున్నారు.. అంతేకాకుండా పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ పై అంచనాలు వేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ పల్స్ ను చూస్తూ.. అనుచరులతో విశ్లేషణ జరుపుతున్నారు. తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, హ్యాట్రిక్ కొడతామని కేటీఆర్‌ తెలిపారు. ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి కంగారుపడాల్సిన అవసరం లేదని, ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పయితే డిసెంబర్‌ 3 తర్వాత క్షమాపణలు చెబుతారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

2018 తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పని తేలాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఓ రబ్బిష్‌. ఎగ్జిట్‌ పోల్స్‌ గతంలోనూ చూశాం. మాకు కొత్తకాదు. డిసెంబర్‌ 3న మళ్లీ అధికారం చేపడతాం. ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి కంగారుపడాల్సిన అవసరం లేదు. 70 పైగా స్థానాల్లో తిరిగి అధికారంలోకి వస్తాం. ఎగ్జిట్ పోల్స్‌తో న్యూసెన్స్ నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నారు.. ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ కు ఎలా పర్మిషన్ ఇస్తుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పయితే డిసెంబర్‌ 3 తర్వాత క్షమాపణలు చెప్తారా?.” అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

KTR angry on exit polls what he said
KTR

ఇక తెలంగాణ కేసీఆర్ తోనే ఉందంటూ మరోసారి.. కేటీఆర్ ఎక్స్‌లో కీలక మెస్సెజ్ ను షేర్ చేశారు. ‘‘చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్ర పట్టింది.. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోలేదు.. ఎక్సాక్ట్ పోల్స్ మాకు శుభవార్తనిస్తాయి’’.. అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ఐదు రాష్ట్రాలఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ పలు సంస్థలు ప్రకటించాయి. దీంతో పలు రాజకీయ పార్టీలు, ప్రజలు ఈ సర్వేలను నిశితంగా పరిశీలిస్తున్నారు. జన్ కీ బాత్ నిర్వహించిన సర్వే ప్రకారం.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే అత్యధిక సీట్లు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి సర్వే ప్రకారం… కాంగ్రెస్ పార్టీకి 48-64 వరకు సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ బీఆర్ఎస్ 40-55 సీట్లు గెలుస్తుందని జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్‌లో పేర్కొంది. మ‌రి డిసెంబ‌ర్ 3న ఏం జ‌రుగుతుంద‌నేది చూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

14 hours ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

21 hours ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

2 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

2 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

2 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

3 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

4 days ago