Kriti Sanon : ప్రభాస్ హీరోగా కృతిసనన్ కథానాయికగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 16వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో సైతం రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇటీవల తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి భారీ ఎత్తున ప్రభాస్ అభిమానులు హాజరయ్యారు. ఇక ఈ చిత్రం జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వేలాది ధియేటర్లలో రిలీజ్ అవుతుంది.
ఆదిపురుష్ సినిమా ధియేటర్లకు చెప్పులతో వెళ్లాలా లేదా.. చెప్పులు లేకుండా ధియేటర్ లోకి వెళ్లాలా అనే డిస్కషన్ నడుస్తుంది. దీనికి కారణం కూడా హీరో ప్రభాస్.. చిత్ర యూనిట్ చేస్తున్న పనులు అని అందరు అనుకున్నారు. అయితే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై హీరో ప్రభాస్ తోపాటు.. మిగతా చిత్ర యూనిట్ సభ్యులు, అతిధులు ఎవరూ చెప్పులు వేసుకోలేదు. అందరూ చెప్పులు విప్పి.. కాళ్లతో తిరిగారు. ఇదొక్కటే కాదు.. మొన్నటికి మొన్న. ఆదిపురుష్ టీం ఓ ప్రకటన చేసింది. ప్రతి సినిమా ధియేటర్ లో.. ప్రతి షోలో.. ఓ సీటు హనుమంతుడు.. అదేనండీ ఆంజనేయస్వామికి కేటాయిస్తామని అన్నారు.
ఏ గుడికి వెళ్లినా చెప్పులను ఆలయం బయట వదిలి వెళతాం.. అదే విధంగా ఓ సినిమా ధియేటర్ లో.. ప్రతి షోలో.. ఓ సీటును ఆంజనేయస్వామికి కేటాయించటం జరిగినప్పుడు.. ఆలయంగా భావించే ధియేటర్ లోకి చెప్పులతో ప్రేక్షకులు ఎలా వెళతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అంత సాఫీగాసాగుతున్న సమయంలో చిత్ర దర్శకుడు ఓం రౌత్.. హీరోయిన్ కృతి సనన్ని తిరుమల మాడ వీధుల్లో ముద్దు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దానిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కూడా ఆదిపురుష్ టీం మాత్రం స్పందిచడం లేదు.