Krishna Vamsi : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసి స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఖడ్గం సినిమాతో ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్రంలోని ఎన్నో సీన్స్ నేటికీ సగటు ప్రేక్షకుడి కళ్లెదుట కదలాడుతూనే ఉంటాయి. ఇందులో కొన్ని సన్నివేశాలు రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి. వాటికి ప్రేక్షకులు నీరాజనం పలికారు. కొన్ని సీన్స్ కాంట్రవర్సీకి కూడా దారి తీశాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఖడ్గం సినిమా విశేషాలు, సీక్రెట్స్ బయటపెట్టారు డైరెక్టర్ కృష్ణవంశీ.
ఖడ్గం చిత్రంలో యాక్టర్ పృథ్వీ రాజ్ రోల్ బాలకృష్ణను ఉద్దేశించి పెట్టారని గతంలో ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో కూడా ఇందుకు సంబంధించిన కథనాలు పలు సందర్భాల్లో వైరల్ కావడంతో బాలయ్య బాబు ఫ్యాన్స్ కృష్ణవంశీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా స్పందించిన ఆయన పృథ్వీ రాజ్ పాత్ర ఎవరినీ ఉద్దేశించి తీసింది కాదని.. కానీ ఆ పాత్ర వల్ల చాలా నష్టపోయానని అన్నారు. బాలయ్య బాబుని ఇమిటేట్ చేసిన పని కాదని అన్నారు. అంతేకాదు బాలయ్యలా డైలాగ్ లు ఎవరు చెప్పగలరని ప్రశ్నిస్తూ.. అజ్ఞానం, అమాయకత్వంతో సృష్టించిన ఆ రోల్ తో చాలా మంది తనపై పగబట్టారని చెప్పుకొచ్చారు.
హీరోయిన్ల విషయంలో తనకు బాపు గారు, రాఘవేంద్ర రావు గారు స్పూర్తి అని కృష్ణవంశీ తెలిపారు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య వందో సినిమా కోసం పలువురు దర్శకులు పేర్లు పరిశీలనకు రాగా.. అందులో కృష్ణవంశీ పేరు ప్రముఖంగా వినిపించింది. బాలయ్యకు అప్పట్లో రైతు పేరుతో ఓ కథను వినిపించారు కృష్ణవంశీ. అయితే ఈ సినిమాలో రాష్ట్రపతి పాత్ర కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను తీసుకోవాలని అనుకోగా, ఆయన వేరే కమిట్‌మెంట్స్ తో బిజీగా ఉండడం వలన సినిమా చేయలేనని అన్నారు. దీంతో బాలయ్య-కృష్ణవంశీ చిత్రం ఆగిపోయింది. ఇప్పుడు కృష్ణవంశీ అంత హిట్ చిత్రాలు చేయలేకపోతున్నారు.ఇటీవల తీసిన ’రంగమార్తాండ’ కమర్షియల్ హిట్ సాధించలేకపోయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…