Krishna Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న అనారోగ్యం కారణంగా కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే.సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీ మూగబోయింది. ఆయనను కడసారి చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుండి చాలా మంది అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. కృష్ణ సాధించిన ఘనతల్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళి అర్పించారు. ఇక కృష్ణ మరణం తర్వాత సోషల్ మీడియాలో అయితే ఆయనపై అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా అభిమానం చాటుకుంటున్నారు. తాజాగా ఒక నెటిజన్ సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు చేసిన సినిమాల్లోని సేమ్ టు సేమ్స్ సీన్స్‌ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మహేష్ బాబు చిన్నప్పుడే సినిమాల్లో నటించగా.. కృష్ణతో కలిసి కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు. కృష్ణ దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించగా.. మహేష్‌బాబు బాల నటుడిగా 9 సినిమాలు, హీరోగా ఇప్పటికే 27 సినిమాల్లో యాక్ట్ చేశాడు. ప్రస్తుతం రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. దాంతో నెటిజన్ కృష్ణ, మహేష్ బాబు నటించిన సినిమాల్లో కామన్‌గా ఉన్న కొన్ని సీన్స్‌ని ఎడిట్ చేశాడు. ఈ ఎడిట్ చూసిన భలే ఎడిటింగ్ చేశావ్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే కృష్ణను కడ సారి చోరీ చూపుకు వచ్చిన అభిమానులను చూసి యావత్ సినీ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో మహేష్ బాబు చాలా కృంగిపోయారు.ఒకే ఏడాదిలో వరుసగా మూడు మరణాలు చోటు చేసుకోవడంతో మహేష్ బాబు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు అభిమానులు అన్న నువ్వు అదైర్య పడకు మీకు మేము ఉన్నాము అంటూ మహేష్ బాబుకు ధైర్యం చెప్పారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి మంచి వ్యక్తి తెచ్చుకున్న ఆ నట శేఖరుడికి రాజకీయ నాయకులు తెలుగు సినీ ప్రముఖులు అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు.
Wow! Almost 200K views in 24hrs????, did not sleep for the past few days for making this edit & can't sleep now for the response????
Thank you everyone for making this happen????
Just Hoping @urstrulyMahesh Anna also watches it????
????:@MusicThaman @ThisIsDSP#SuperStarKrishna #MaheshBabu https://t.co/FySv4yW4Pj— Ayyo (@AyyAyy0) November 19, 2022