Krishna Kumar : ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రభాస్ మూవీ కల్కి గురించే చర్చ నడుస్తుంది. సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన ప్రబాస్, దీపికా, కమల్,అమితాబ్‌ల గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ఇక చిత్రంలో సినిమాలో కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని సీన్స్ ని చూపించారు. మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, ఉత్తర, అశ్వత్థామ పాత్రలను చూపించారు. అందులో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, కర్ణుడిగా ప్రభాస్, ఉత్తరగా మాళవిక నాయర్, అర్జునుడిగా విజయ్ దేవరకొండ కనిపించారు. అయితే కృష్ణుడి పాత్రను మాత్రం ఫేస్ కనిపించకుండా కేవలం అతని ఆహార్యం మాత్రమే కనిపించేలా సీన్స్ తీశారు.
సినిమాలో కృష్ణుడు పాత్రలో నటించింది ఒక యాక్టర్ అయితే, వాయిస్ ఇచ్చింది మాత్రం ఇంకో యాక్టర్. కృష్ణుడిగా నటించిందెవరా? అనేది మిలియన్ డాలర్ క్వచ్చిన్ గా మారింది. .ఆ క్యారెక్టర్ పోషించిన వ్యక్తి బాడీ లాంగ్వేజ్ అచ్చం హీరో నాని మాదిరిగా ఉండటంతో మొదట అంతా అతనే అని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని కృష్ణుడి పాత్ర పోషించింది ఒక తమిళ నటుడు. కృష్ణుడి పాత్రలో కృష్ణ కుమార్ అనే నటుడు నటించారు. థియేటర్ ఆర్టిస్ట్ గా పలు నాటకాల్లో నటించిన కృష్ణ కుమార్ ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంటున్నాడు. పలు తమిళ్ సినిమాల్లో నటించాడు. సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాలో పైలెట్ గా కనపడ్డాడు. ధనుష్ మారన్ సినిమాలో పోలీస్ గా నటించాడు.
‘కాదళగి’తో 2010లో తెరంగేట్రం చేసిన ఆయనకు ‘కల్కి’ ఐదో చిత్రం. ఇతను యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్షన్ కొరియోగ్రాఫర్ కూడా. తానే ఈ రోల్ చేసినట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ కూడా పెట్టాడు. అలాగే శ్రీకృష్ణుడి వాయిస్ ని చాలా తక్కువ మంది గుర్తుపట్టారు.శ్రీకృష్ణుడి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చింది మరెవరో కాదు.. ట్యాలెంటెడ్ యాక్టర్ అర్జున్ దాస్. మంచి బేస్ వాయిస్ ఉన్న ఈ యాక్టర్ ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కల్కి మూవీలోని శ్రీకృష్ణుడి పాత్రకు అర్జున్ దాస్ వాయిస్ ఇచ్చాడని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు.