Krishna And Sobhan Babu : అటు శోభన్ బాబు.. ఇటు కృష్ణ టాలీవుడ్ సినిమా ఖ్యాతిని పెంచిన హీరోలు. వందల సినిమాలలో నటించిన వారిద్దరు కలిసి మల్టీ స్టారర్స్ చిత్రాలు కూడా చేశారు. ఒకప్పుడు మల్టీ స్టారర్స్ చిత్రాలంటే అభిమానులలో ఎంతో ఆసక్తి ఉండేది. ఆయా హీరోల సినిమాలు ఎన్ని వచ్చిన కూడా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉండేవారు. కాని ఇప్పటిలా పెద్ద గొడవలు చేసేవాళ్లు కాదు అభిమానులు. కృష్ణ, శోభన్‌బాబుకి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకొని అప్పటి సినిమా దర్శక, నిర్మాతలిద్దరినీ కలిపి మల్టీస్టారర్ సినిమాలు తీయడానికి ఎక్కువగా ఆసక్తి చూపేవారు.
ఈ క్రమంలోనే వారిద్దిరి కాంబినేషన్‌లో 17 మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. కృష్ణార్జునులు, దొంగలు, మహాసంగ్రామం, ముందడుగు వంటి చిత్రాలు మంచి హిట్ కొట్టాయి. కృష్ణ, శోభన్ బాబు కాంబినేషన్ కొన్నేళ్ల పాటు కొనసాగింది. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన మహాసంగ్రామం సినిమా మల్టీస్టారర్ గా చివరి సినిమా కావడం విశేషం. దీని వెనకాల చాలా పెద్ద కథ ఉందట. ఆ కారణం ఏంటంటే.. శోభన్‌బాబు ఇకపై కృష్ణతో సినిమాలు తీయకూడదని నిర్ణయించుకున్నారట. అందుకు కారణం మహాసంగ్రామం సినిమాలోని తన సీన్లన్నీ కూడా కట్ చేయడమే ప్రధాన కారణమట.
తొలుత ఈ సినిమాలో శోభన్ బాబుకి సంబంధించిన సన్నివేశాలు అన్ని చిత్రీకరించిన తరువాత కృష్ణకి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారట. కానీ సినిమా అవుట్ పుట్ విషయానికి వచ్చే సరికి కొన్ని సన్నివేశాలకు సంబంధం లేకపోవడం వలన శోభన్ బాబు సన్నివేశాలని కట్ చేయాల్సి వచ్చిందట. దాంతో సినిమా చూసిన అభిమానులు ఆయన ఇంటికి వెళ్లి మరి మీ సీన్లు చాలా తక్కువగా ఉండడం వల్ల గెస్ట్ అపీరియన్స్ లా మారిపోయిందని, మాకు అస్సలు ఇలా చేయడం నచ్చలేదంట శోభన్ బాబుకే అల్టిమేటం ఇచ్చారట. దీంతో ఇకపై ఇలాంటి సినిమాలు చేయకూడదని శోభన్ బాబు నిర్ణయం తీసుకున్నరని టాక్.