Kota Srinivasa Rao : నటనకు పెట్టిన కోట.. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన చేయని పాత్ర లేదు. కమెడీయన్‌గా, విలన్‌గా, సపోర్టింగ్ పాత్రలలో నటించి మెప్పించాడు. ఒకప్పుడు నటనతో ఎంతగానో అలరించిన కోట శ్రీనివాసరావు వయస్సు పైబడ్డాక ఇంటికే పరిమితం అయ్యాడు. అలానే పలు సమావేశాలలో కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తున్నాడు. తనకు నచ్చని విషయాలపై ఓపెన్‌గా కామెంట్స్ చేసేస్తుంటారు. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన స్టార్ హీరోలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్‌లా మరొకరు రారని, ఆయన మళ్లీ పుడితే తప్ప అని అన్నారు కోట శ్రీనివాసరావు.
అదే సమయంలో ‘ఎన్టీఆర్-ఎఎన్నార్..శోభన్..కృష్ణ ఎవ్వరూ ఏనాడూ తమ రెమ్యూనిరేషన్ గురించి బాహాటంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు నేను రోజుకు రెండు కోట్లు తీసుకుంటా అని ఓపెన్ గా చెప్పడం ఏమిటి?’ ఇది అసలు బాగోలేదు అని కోట శ్రీనివాసరావు అన్నారు. ‘ఇవ్వాళ సినిమా లేదు..మిగిలింది సర్కస్ నే. విషాద గీతాలకు కూడా డ్యాన్స్ లు చేస్తున్నారు. బాత్ రూమ్ బ్రష్ నుంచి బంగారం ప్రకటన వరకు అన్నీ హీరోలే చేస్తే మిగిలిన నటులు ఎలా బతకాలి’ అని నేటి సినిమాలపై కోట కొంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించే కోట శ్రీనివాసరావు అలాంటి మాటలు మాట్లాడారని నెటిజన్స్ భావిస్తున్నారు.
![Kota Srinivasa Rao : స్టార్ హీరోల రెమ్యునరేషన్‌పై కోట శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్..! Kota Srinivasa Rao sensational comments on remuneration](http://3.0.182.119/wp-content/uploads/2023/06/kota-srinivasa-rao.jpg)
అప్పట్లో ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతూ తాను రోజుకి రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని చెప్పారు. ఇప్పుడు కోట దానిపైనే కామెంట్స్ చేశారంటున్నారు నెటిజన్స్. ఇప్పటి యంగ్ హీరోలకు సాధన తక్కువ, వాదన ఎక్కువ అని కోట తెలిపారు.విజ్ఞానం పెరగాలి కానీ విజ్ఞానం పెరిగి జ్ఞానం పోగొట్టుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. సినిమా అంటే నమ్మించడం అని కోట పేర్కొన్నారు. నేను సినిమా కోసం ప్రయత్నం చేయలేదని కోట అన్నారు.సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్లు ఊరికి వచ్చారంటే పరుగెత్తేవారని ఆయన తెలిపారు. ప్రస్తుతం కోట వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.