కొర‌టాల శివ ఇంకా మౌన‌మేనా.. ఇన్ని ఆరోప‌ణ‌లు చేస్తున్నా నోరు మెద‌ప‌రేం..?

ఆచార్య చిత్రం విడుదల కాకముందు  100% సక్సెస్ రేట్ సాధించిన అతికొద్ది మంది టాలీవుడ్ దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఎన్నో భారీ అంచనాల నడుమ చిరంజీవి హీరోగా ఆచార్య చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 29న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం దర్శక నిర్మాతల అంచనాలను తారుమారు చేస్తూ బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాతలు మరియు డిస్టర్బ్యూటర్లతో సహా కొరటాల శివకి కూడా భారీ నష్టం తెచ్చిపెట్టింది.

ఇదివరకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ ఈ  చిత్రం విడుదలైన తర్వాత  అదృశ్యమయ్యాడు. అలాగే మీడియా దృష్టి నుంచి తప్పించుకున్నాడు అనే వార్త ప్రస్తుతం బాగా ప్రచారం అవుతుంది. మరోవైపు చిరంజీవి ఆచార్య ఫెయిల్యూర్‌పై చర్చించినప్పుడల్లా కొరటాల మీద నిందలు మోపుతున్నారు.  ముఖ్యంగా గాడ్ ఫాదర్ చిత్రం ప్రమోషన్స్ సమయంలో చిరంజీవి చేసిన కామెంట్స్ కి  కొరటాల మాత్రం తనపై చేసిన ఆరోపణలపై ఏమీ మాట్లాడలేదు.  అంతేకాకుండా కొరటాల మాత్రం తనపై ఎలాంటి ప్రకటనలు చేసినా స్పందించకుండా మౌనంగానే ఉన్నారు.

koratala siva on silence mode even chiranjeevi said multiple times

కొరటాల ఆచార్య చిత్ర సమయంలో అల్లు అర్జున్ నటించబోయే సినిమాను ప్రకటించారు. కానీ ఇప్పుడు దానిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. ఈ ఏడాది మొదట్లో జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఓ ప్రాజెక్ట్‌ను వెల్లడించాడు. ఎన్టీఆర్ 30 అని తాత్కాలికంగా టైటిల్ పెట్టబడిన ఈ సినిమా ప్రస్తుతం తెరకెక్కింది. ఇక ఎన్టీఆర్ 30 కూడా హోల్డ్‌లో పెట్టినట్లు గత కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లను తిరస్కరిస్తూ  దర్శకుడు కొరటాల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ  రత్నవేలు మరియు ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌తో కలిసి ప్రీ ప్రొడక్షన్ పనిని ముమ్మరం చేసినట్లు ఇటీవల ప్రొడక్షన్ టీమ్ సన్నిహితులు పేర్కొన్నారు.

ఇక మీడియాకు కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు అని ప్రచారం అయ్యే వార్తపై  కొరటాల మౌనాన్ని విడిచి స్పందించవలసిన  సమయం ఆసన్నమైంది. అతను ఒక టాప్ డైరెక్టర్ మరియు ఈ పుకార్లు అనేవి కొరటాల శివ  ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ఆయన మౌనం వీడి ప్రస్తుతం జరుగుతున్న పుకార్లపై స్పందించాలని ఆయన అభిమానులు మరియు శ్రేయోభిలాషులు ఎదురుచూస్తున్నారు.

Share
Mounika Yandrapu

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago