Kolikapudi Srinivasa Rao : కొద్ది సేపటి క్రితం టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తిరువూరులో శాసనసభకు పోటీచేసే అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ లకు పాదాభివందనాలు తెలియజేస్తూ యువనేత నారా లోకేష్ విజయవాడ రథసారథి కేశినేని శివనాథ్ (చిన్ని)కి నియోజకవర్గంలోని 4 మండలాల టీడీపీ జనసేన నాయకులకు,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు తిరువూరులో టిడిపి భారీ విజయం సాధించి టిడిపి జెండా రెపరెపలాడబోతుందని అలాగే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పట్టణంలోని చెప్పుకొచ్చారు.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే ఎస్సీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాసరావుని టిడిపి-జనసేన ఉమ్మడి పార్టీల అధినేతలు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ప్రకటించడంతో తిరువూరులో సంబరాలు చేసుకుంటున్నారు టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు. ప్రతి ఇంటికి తిరిగి అన్ని విషయాలపై సమగ్ర పరిశీలన చేస్తామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే మాజీ మంత్రి కొడాలి నాని చేసే రాజకీయ విమర్శలు కేవలం సీఎం జగన్‌ను తృప్తి పరచడం కోసమే చేస్తున్నారని ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు.
కొడాలి నాని అందరిని నమ్మించి మోసం చేస్తున్నారని.. అలాంటి బాధితుల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కమ్మ సామాజిక వర్గం నాయకులు, వ్యాపారస్తులు కొడాలి నాని బాధితులేనని అన్నారు. గుడివాడలో కాపులు నాని వల్ల ఆర్థికంగా నష్టపోయారని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారని అన్నారు. ‘కొడాలి నానికి ఇదే నా హెచ్చరిక.. అభివృద్ది గురించి మాట్లాడాలని.. దానికి మేము సమాధానం చెబుతామని’ కొలికపూడి శ్రీనివాసరావు హెచ్చరించారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫిర్యాదు మేరకు కొలికపూడిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఉన్మాది సీఎం జగన్ ఆగడాలను ప్రపంచానికి తెలియచేశాయనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5ఛానళ్లపై విషం కక్కుతున్నారని టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…