Kodali Nani : ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయం రోజు రోజుకి హీటెక్కిపోతుంది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. వైసీపీ నాయకలపై దారుణమైన విమర్శలు చేస్తుండగా, కొడాలి నాని, రోజా, వంశీ, అంబటి రాంబాబు వంటి వారు ధీటుగా బదులిస్తున్నారు. బూతులతో రెచ్చిపోతూ కొడాలి నాని అయితే దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. మామనే మోసం చేసిన వాడివి ప్రజలని ఏం ఉద్దరిస్తావ్ అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరినైన టచ్ చేయి అసలు సంగతి చూస్తా. నేను నా నాయకుడు, ప్రజల కోసం ఎంత దూరం అయిన వెళతాను అని నాని సవాల్ విసిరారు.
భారతమ్మ ఫొటో ఏ మీడియాలో అయిన కనిపించింది అంటే అప్పుడు వారి సంగతి చూస్తా అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. చంద్రబాబు వెనుక బీసీలెవరూ లేరని.. చంద్రబాబు వెంట ఉన్నది.. రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు అని అన్నారు. వీళ్లెవరూ బీసీలు కాదని.. అధికారం ఇస్తే బాబుతో పాటు వీళ్లే బాగుపడతారని తెలిపారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే తన సామాజికవర్గానికే మంత్రి పదవులు ఇస్తారని.. చంద్రబాబును ఆల్‌ఫ్రీ బాబు అని వైఎస్సార్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు దొంగ, 420, ఔరంగజేబు అని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారని.. బాబు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంత ఇచ్చాడు అని క్వశ్చన్ చేశారు.
రాష్ట్రంలో చంద్రబాబు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చాడా.. టీడీపీ హయాంలో లోకేష్‌కు తప్ప రాష్ట్రంలో ఒక్కరికీ ఉద్యోగం రాలేదు అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కొడాలి నాని చేసిన కామెంట్స్ ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గుడివాడ సీటు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అక్కడ ఎలాగైనా మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించాలనేది టీడీపీ లక్ష్యంగా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…