Kodali Nani : ప్రస్తుతం ఏపీలో విమర్శల పర్వం కొనసాగుతుంది.ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాన్ని మరింత రాజేస్తున్నారు.యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ నేత నారా లోకేష్ చేస్తున్న విమర్శలపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నీ తండ్రి అయితే గుడివాడలో పోటీ చేయాలని, గన్నవరంలో నువ్వు పోటీ చేయాలని లోకేష్ కు కొడాలి నాని ఇవాళ సవాల్ విసిరారు. తల్లిని అవమానించినందుకు ప్రతికారంగా, లోకేష్ వచ్చి తన మూత్రం తీసుకువెళతాడంట అంటూ ఎద్దేవా చేశారు. పాదయాత్ర ఇచ్చాపురం వచ్చేసరికి డైపర్ కూడా ఊడ కొట్టి, ప్రజలు తన్నే తన్నుకి కర్ణాటకలోనో, తమిళనాడులోని లోకేష్ పడతాడని కొడాలి హెచ్చరించారు.
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేఖ ఓటు చీలనివ్వను అని చేసిన కామెంట్స్ పై స్పందించాడు కొడాలి నాని. పవన్ చేసే పనులు ప్రతి ఒక్కరికి అర్ధమవుతాయి. మేము అధికారంలో ఉంటే అందరిని కలుపుకొని ఓటు చీలనివ్వను అంటాడు. అదే చంద్రబాబు అధికారంలో ఉంటే మాత్రం సపరేట్‌గా పోటీ చేస్తాడు. పవన్ చేసే పనులు అన్ని కూడా చిన్న పిల్లాడిని అడిగిన కూడా చెబుతాడు. ఈ రాజకీయాలన్ని మనకు తెలియనికావు. చంద్రబాబే..జనసేనని పెట్టించింది. ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు కలిసి జగన్ మోహన్ రెడ్డిని ఏదో చేద్దాం అని అనుకుంటారు. కాని వారి వల్ల కాదు. ప్రజల సపోర్ట్ ఉన్నన్ని రోజులు ఎవరిని ఏం చేయలేరు అని కొడాలి నాని అన్నారు.
ఎవరు ఎలా వచ్చిన కూడా జగన్ ప్రభంజనాన్ని ఆపలేరు. ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తున్నాడు. నా పరిపాలన నచ్చితే ఓటు వేయండని చెబుతున్నాడు. గుంపులుగా వస్తామని చెప్పడం లేదు కదా అని నాని అన్నారు. ప్రజలను, దేవుడిని నమ్మినం కాబట్టి తప్పక గెలుస్తాం. లోకేష్‌పై కూడా దారుణమైన కామెంట్స్ చేశాడు కొడాలి నాని.