Kodali Nani : ఏపీ ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో అన్ని పార్టీల వారు ప్రచారం జోరు పెంచారు. ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేల ట్రాన్స్‌ఫర్ ఏమిటన్న చంద్రబాబు వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. 30 ఏళ్ల కిందటే.. చంద్రగిరి నుంచి కుప్పంకు ట్రాన్స్‌ఫర్‌పై చంద్రబాబు వెళ్లలేదా అని ప్రశ్నించారు. పవన్ భీమవరం, గాజువాకకు.. లోకేశ్.. మంగళగిరికి వలస వచ్చిన వారే అని చెప్పారు. బాబు, పవన్, లోకేష్.. ఎమ్మెల్యేలుగా గెలిస్తే చాలని యుద్ధం చేస్తున్నారని సెటైర్ వేశారు.వీరందరు జగన్ మోహన్ రెడ్డి వెంట్రుకు కూడా పీకలేరని ఆయన సవాల్ విసిరారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆయనని గెలిపిస్తాయని చెప్పుకొచ్చారు.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం కావడంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న మాట్లాడుతూ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు, పవన్ కలిస్తే మీకెందుకు భయమని ప్రశ్నించారు. ఇలానే మాట్లాడితే మీకు బడితె పూజ తప్పదని హెచ్చరించారు. మరో మూడు నెలలు ఆగితే… ఇప్పుడు వాగుతున్న వారందరి నోళ్లు మూతపడతాయని చెప్పారు. కొడాలి నాని వంటి వాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలని వెంకన్న అన్నారు. లేకపోతే వీరికి బుద్ధి వచ్చేలా టీడీపీ కేడర్ సమాధానం చెపుతుందని హెచ్చరించారు. మూడు నెలల తర్వాత వీరికి గన్ మెన్లు కూడా ఉండరని అన్నారు.
![Kodali Nani : ఇన్‌చార్జ్ మార్పులపై లోకేష్ పంచ్‌లు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని.. Kodali Nani strong counter to nara lokesh about incharge changes](http://3.0.182.119/wp-content/uploads/2023/12/kodali-nani.jpg)
టీడీపీ, జనసేనలు పొత్తులో ఉన్నాయని… ఈ విషయం తెలుసుకుని వైసీపీ నేతలు మాట్లాడాలని చెప్పారు. నారా లోకేశ్ డైరీలో ఇప్పటికే కొందరి పేర్లు ఉన్నాయని… మరికొన్ని పేర్లు కూడా డైరీలోకి ఎక్కుతాయని అన్నారు. రీసెంట్‌గా ఇన్‌చార్జ్‌ల విషయంలో మంత్రి రోజా కూడా స్పందించడం మనం చూశాం. తనకి జగన్ తప్పక న్యాయం చేస్తారని ఇందులో భయపడాల్సింది ఏమి లేదని వాపోయింది. రోజా అయితే జగన్ బర్త్ డే సందర్భంగా క్రిస్మస్ తాత గెటప్‌లోకి మారి గిఫ్ట్‌లు పంచిపెట్టింది.