Kodali Nani : వెయ్యి మంది బాల‌కృష్ణ‌లు, చంద్ర‌బాబులు వ‌చ్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని ఏం చేయ‌లేరు: కొడాలి నాని

Kodali Nani : ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం చాలా వేడెక్కిపోతుంది. ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. నందమూరి కుటుంబంలో బాలయ్య వర్సస్ జూఎన్టీఆర్ వివాదం ముదురుతోంది. కొంత కాలంగా టీడీపీ, జూ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ కనిపిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ వర్దంతి నాడు ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా మరోసారి బాలయ్య అక్కడ జూ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలిగించాలని ఆదేశించటం మరో వివాదానికి కారణమైంది. ఈ వివాదంపైన మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్ కామెంట్స్ చేసారు వాళ్లది నీచాతి నీచమైన బుద్ధి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెయ్యి మంది చంద్రబాబులు, బాలకృష్ణలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని అన్నారు.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినవారు ఆయన వర్ధంతిని చేయడం ఏమిటని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతిని చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ ను గద్దె దింపిన బాలకృష్ణ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబును రారమ్మని పిలుస్తోందని అన్నారు. తన కొడుకునే సీఎం చేయాలనేదే చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి కొడాలి నాని నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. జగన్ పక్కన పెట్టేసిన నేతలే చంద్రబాబును కలుస్తున్నారని అన్నారు.

Kodali Nani sensational comments on chandra babu and balakrishna
Kodali Nani

ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తాతకు వేకువజామున నివాళి అర్పించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు తరలి వచ్చారు. జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. ఆ తరువాత నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్నారు. అక్కడ జూ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూసిన ఆయన వెంటనే వాటిని తొలిగించాలని ఆదేశించారు.ఈ క్ర‌మంలోనే కొడాలి నాని ఘాటుగా స్పందించారు.ఎన్టీఆర్ వర్దంతి నాడు నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి తెర మీదకు రావటంతో దీని పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago