Kodali Nani : మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా నటించిన మల్టీ స్టారర్ చిత్రం బ్రో జూలై 28న విడుదలైన విషయం తెలిసిందే. వినోదయ సీతం అనే తమిళ సినిమాకు స్క్రిప్ట్ తోపాటు పలు మార్పులతో ఆవిష్కరించిన బ్రో మూవీకి సముద్ర ఖని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు ప్రేయసిగా రొమాంటిక్ బ్యూటి కేతికా శర్మ, చెల్లెలుగా వింక్ బ్యూటి ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. బ్రో సినిమాకు బీజీఎమ్ లతో అదరగొట్టే తమన్ మ్యూజిక్ అందించారు. టైమ్ అనేది ఎంత విలువైందో చెప్పే ప్రయత్నం చేసిన సినిమా బ్రో. ఇక పవర్ స్టార్ రేంజ్ లో దీనికి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలు కలుపుకుని మొత్తంగా రూ. 80.50 కోట్ల బిజినెస్ అయింది. ఇక, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్లో రూ. 12 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 55.26 కోట్ల షేర్, రూ. 91.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది పవన్-సాయి తేజ్ బ్రో సినిమా. వంద కోట్లు వసూళ్లు చేసినట్టు తెలుస్తుండగా, దీనిపై మెగా అభిమానులు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఒకవైపు బ్రో సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తుండగా, మరో వైపు జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
వైసీపీ నాయకులు, ఆ పార్టీకి చెందని శ్రేణులు మాత్ర్ విమర్శలు కురిపిస్తున్నాయి. అంబటి రాంబాబు తన ట్విట్టర్లో . ‘ప్రొడ్యూసర్ కి కలెక్లన్లు నిల్లు… ప్యాకేజీ స్టార్ కి పాకెట్ ఫుల్లు’ అంటూ ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ ను పవన్ కల్యాణ్ కు, నిర్మాత విశ్వప్రసాద్ కు ట్యాగ్ చేశారు. అంబటి చేసిన తాజా ట్వీట్ పై పవన్ అభిమానులు, జనసైనికులు మండిపడుతున్నారు. ఇక వైసీపీ నేత కొడాలి నాని సైతం పవన్ని కించపరిచేలా కామెంట్ చేశారు. దీనిపై పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.