Kodali Nani : చంద్రబాబు అరెస్ట్ తర్వాత వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా తమదైన స్టైల్‌లో స్టేట్‌మెంట్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడుకి రిమాండ్ విధించడంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. నన్నేవరెం చేయలేరు అనుకుంటున్నా చంద్రబాబు అహంకారానికి కోర్టు తీర్పు చెంపపెట్టు అని కొడాలి నాని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు అన్న ఎన్టీఆర్ ఆత్మ శాంతించిన రోజు అని.. ప్రపంచంలోని ఎన్టీఆర్ విగ్రహాల నుండి ఆనందభాష్పాలు వస్తున్నాయని అన్నారు. 74 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ కు క్షోభ పెట్టిన చంద్రబాబు, అదే వయసులో జైలుకెళ్లాడని ఆయన చెప్పుకొచ్చారు.
దేవుడు ముందు ఎవరు తప్పించుకోలేరన్నది చంద్రబాబు విషయంలో నిరుపితమైందన్నారు. ఎంగిలి మెతుకులకు ఆశపడిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నాడు తండ్రిని క్షోభ పెట్టిన చంద్రబాబు కాళ్ల వద్దకు చేరారని విమర్శించారు. తనలోని దొంగ స్కిల్స్ అన్నీ ఉపయోగించి స్కిల్ డెవలప్మెంట్ సొమ్మును చంద్రబాబు దోచుకున్నాడని కొడాలి విమర్శించారు. సాక్షాల సహాతో చంద్రబాబుని పట్టుకున్న, సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎన్టీఆర్ , వైయస్సార్ అభిమానీగా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టుగా నాని తెలియజేశారు. ఎన్నికలవేళ సింపతి వస్తుందని కూడా ఆలోచించకుండా అవినీతిపరుడు చంద్రబాబుపై, సీఎం జగన్ దర్యాప్తు చేయించారని,అవినీతి ఎవరు చేసిన ఉక్కు పాదంతో అణిచివేస్తానని జగన్ నిరూపించారన్నారు.
లక్షల మంది పిల్లల సొమ్మును ఇష్టానుసారంగా దోచుకున్న చంద్రబాబు… లోకేష్‌కు దారా దత్తం చేశాడంటూ నాని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబును జైలుకు ఈడ్చుకెళ్తున్న విషయాన్ని.. లోకేష్ తన రెడ్ బుక్‌లో రాసుకోవాలంటూ కొడాలి నాని సూచించారు. సాక్ష్యాలతో సహా చంద్రబాబుని పట్టుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని.. ఎన్టీఆర్, వైయస్సార్ అభిమానిగా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కొడాలి నాని తెలిపారు.