Kodali Nani : గురువారం గుడివాడలోని మల్లాయపాలెం టిడ్కో లే అవుట్‌ల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గడప గడప కోసం వెళ్లినప్పుడు ఓ కుర్రాడు లివర్ ప్లాంటేషన్ చేయించుకున్నానని అది జగన్ వల్లనే సాధ్యమైందని చెప్పాడు. అదే చంద్రబాబు ఉంటే చచ్చిపోయి ఉండేవాడినని అన్నాడు. మాకు కళల్లో నీళ్లు వచ్చాయి అని నాని అన్నాడు. గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ళ పట్టాల కోసం చంద్రబాబు ఒక ఎకరం ఇచ్చినట్లు నిరూపించినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. ఈ రాష్ట్రానికి జగనే శాశ్వత ముఖ్యమంత్రి అని కొడాలి నాని స్పష్టం చేశారు.
2004లో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు చంద్రబాబు తొమ్మిదేళ్లుగా సీఎంగా ఉన్నారని నాని తెలిపారు. అప్పటికే 10 వేల మంది నిరుపేదలున్నట్లు తాను అప్పటి సీఎం వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు. ‘‘నేను లెగిస్తే ఎవరూ పడుకోరని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నారు. చంద్రబాబు మగాడైతే గుడివాడ నుంచి పోటీ చేయాలి’’ అని నాని సవాల్ విసిరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు విసిరారు. అసెంబ్లీలో అడుగు పెట్టడానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారన్నారు. నవనీత్ కౌర్, సుమలత ఇద్దరూ సినీ హీరోయిన్లని.. ఈ ఇద్దరూ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎంపీలు అయ్యారని తెలిపారు.
![Kodali Nani : కొడాలి నాని మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సీఎం వైఎస్ జగన్.. ఏం మాట్లాడాడంటే..! Kodali Nani comments cm ys jagan got emotional](http://3.0.182.119/wp-content/uploads/2023/06/kodali-nani-cm-ys-jagan.jpg)
అయితే 16 పార్టీలతో పొత్తులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఏం సాధించారని నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు కోరిక ప్రతిపక్ష నేతగా ఉండటమని.. పవన్ కళ్యాణ్ కోరిక ఎమ్మెల్యే కావటమని.. దీని కోసం ఈ ఇద్దరూ పొత్తు పెట్టుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేగలిగే ధైర్యం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవరికీ లేదని కొడాలి నాని పేర్కొన్నారు. . మీ దయవల్ల గుడివాడ ఎమ్మెల్యేగా కూడా తానే ఉంటానని, వచ్చే ఐదేళ్లలో రూ.750 కోట్లిస్తే 2029లో ఇక ఏమీ అడగనని కొడాలి తెలిపారు. చచ్చేంతవరకూ మీతోనే ఉంటానని సీఎం జగన్ కు కొడాలి హామీ ఇచ్చారు.