Celebrities : ఐదు దశాబ్దాలుగా యావత్ దేశం ఎదురుచూసిన ఆ క్షణం రానే వచ్చింది. అంగరంగ వైభవంగా ఆ శ్రీరాముడు అయోధ్యలో బాలరాముని రూపంలో కొలువుదీరాడు. ఈ మహా ఘట్టాన్ని ఒక్క భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా తిలకించారు. జైశ్రీరామ్ నినాదాలతో అయోధ్య మారుమోగింది.బాల రాముడిని చూసి ప్రతి ఒక్కరు పులకించిపోయారు. స్వర్ణాభరణాలలో బాలరాముడు చాలా అందంగా కనిపించాడు. 500సంత్సరాల పోరాటం, 100 సంవత్సరాల న్యాయపోరాటం, లక్షలాది రామ భక్తుల ప్రాణదానాలు, కరసేవకుల త్యాగాల ఫలితంగా నేడు ఆ శ్రీరాముడికి భవ్య రామ మందిరం నిర్మిత మైంది. ఇక ఈ మహాఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు చాలా మంది సెలబ్రిటీలు అయోధ్యకి వెళ్లారు.
ఇక రాములోరికి ఎవరి స్థోమతకు తగినట్లు వాళ్లు బహుమతులు, విరాళాలు సమర్పించుకున్నారు. ఒక దశలో విరాళాలు ఇక చాలు, ఎవరూ విరాళం ఇవ్వొద్దంటూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రకటించాల్సి వచ్చింది. సూరత్ కు చెందిన భవికా మహేశ్వరి పదకొండేళ్ల వయసులో విరాళాల సేకరణ మొదలుపెట్టింది. మూడేళ్లపాటు దేశమంతా తిరుగుతూ రూ.52 లక్షల విరాళాలు సేకరించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేసింది. ఇక ఈ మందిర నిర్మాణానికి రూ. 30 లక్షలకు పైగా విరాళం ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభం కాగానే అంటే 2021లోనే విరాళం అందించారు. ఆయనే కాదు ఆయన దర్శక నిర్మాతలతో కూడా ఇప్పించాడట మొత్తంగా పవన్ తరపు నుండి అయోధ్య రామ మందిర నిర్మాణానికి సుమారు 80 లక్షల రూపాయల వరకు విరాళాలు వెళ్లాయని సమచారం.
ఇక బాపూ బొమ్మగా పేరు తెచ్చుకున్న ప్రణీతా సుభాష్ గతంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం చేపట్టిన దేశవ్యాప్త ప్రచారానికి రూ.1 లక్ష విరాళంగా ఇచ్చారు. బిగ్ బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్ ఆది రెడ్డి .. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్‌కు తన వంతుగా ఒక లక్ష రూపాయలు విరాళం అందించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రామమందిర నిర్మాణం కోసం విరాళం ప్రకటించారు కాని ఎంతిచ్చారో స్పష్టంగా చెప్పలేదు. ఇక అయోధ్య రామమందిరానికి ఇటుకల విరాళం అందించారు అనుపమ్ ఖేర్. అలానే ముఖేష్ ఖన్నా- 1.11 లక్షల రూపాయలు మనీష్ ముంద్రా- కోటి రూపాయలు హేమ మాలిని, గుర్మీత్ చౌదరి ,గౌతమ్ గంభీర్- కోటి రూపాయలు అందించినట్టు సమాచారం. ప్రభాస్ కూడా భారీగానే విరాళం అందించినట్టు వార్తలు వచ్చాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…