ప్రస్తుతం వరల్డ్ కప్‌లో టీమిండియా అదరగొడుతుంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తో జరిగిన పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీని అందుకుంది. భారత్ విజయంలో విరాట్ కోహ్లీ , కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి కీ రోల్ ప్లే చేసి హీరోలుగా నిలిచారు. భారత్ తరఫున కోహ్లి 85 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, రాహుల్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇద్దరి సూపర్ భాగస్వామ్యంతో టీమిండియా తన వేట మొదలుపెట్టింది. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 97 పరుగులతో అజేయంగా నిలిచిన.. కేఎల్ రాహుల్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
అయితే.. మ్యాచ్ ముగిసిన తర్వాత.. ప్రత్యేక విజయం సాధించిన భారత ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూంలో టీమిండియా కోచింగ్ స్టాఫ్ సత్కరించింది. విరాట్ కోహ్లీ.. తన అద్భుతమైన బ్యాటింగ్, ఫీల్డింగ్ కు గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ ఇచ్చిన క్యాచ్ పట్టినందుకు ఈ గోల్డ్ మెడల్ దక్కింది. అయితే, గోల్డ్ మెడల్ తీసుకునేటప్పుడు కోహ్లీ తెగ రచ్చ చేశాడు. అథ్లెట్లు.. మెడల్ తీసుకునేటప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో.. దానికి డబుల్ రేంజ్ లో కింగ్ రచ్చ రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది.
ప్రపంచ కప్‌లో భాగంగా టీమ్‌ఇండియా\ ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఉత్తమంగా ఫీల్డింగ్ చేసిన ఆటగాడికి కోచ్ దిలీప్ ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డుతోపాటు గోల్డ్ మెడల్ అందిస్తున్నారు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, జడేజా, శ్రేయస్ అయ్యర్ మైదానంలో చురుగ్గా పరుగెత్తారని దిలీప్ పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాగా చేశాడన్నారు. మొత్తం మీద రాహుల్‌ను ‘ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపిక చేశారు. గత మ్యాచ్‌లో ఈ అవార్డును అందుకున్న శార్దూల్ ఠాకూర్ చేతుల మీదుగా అతడికి గోల్డ్ మెడల్ అందించారు. అప్పుడు కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరచింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
https://youtube.com/watch?v=wqcYtzePCm0