Kids On Roja : ఇటు సినిమాలు అటు రాజకీయాలు చేస్తూ సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారాడు పవన్ కళ్యాణ్. ఆయన నటించిన తాజా చిత్రం బ్రో. రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బ్రో మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. ఇక పవన్ తనదైన శైలీలోనే స్వాగ్స్, సెటైరికల్ పంచ్ లు వేశాడు. ఇక పవన్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమాతో ఫుల్ ఖుషి అవుతున్నారు. కానీ నార్మల్ ఆడియెన్స్ కు మాత్రం రొటీన్ చిత్రంగా కనిపిస్తుంది. ఇలా మిశ్రమ స్పందనతో రన్ అవుతున్న బ్రోకు వర్కింగ్ డే అయిన 5వ రోజు కలెక్షన్స్ కాస్త తగ్గాయి.
అయితే బ్రో సినిమాలో అంబటి రాంబాబుపై సెటైర్స్ వేసినట్టు తెలుస్తుండగా, దీనిపై వైసీపీ నాయకులు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు మాత్రం వైసీపీ నాయకులని బూతులు పురాణంతో తిట్టిపోస్తున్నారు. బ్రో సినిమా థియేటర్‌లో కొందరు చిన్న పిల్లలు రోజాతో పాటు పలువురు వైసీపీ నాయకులని పచ్చి బూతులతో తిట్టిపోసారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, కొందరు నెటిజన్స్ పిల్లలకి సూచనలు చేస్తున్నారు. చదువుకునే పిల్లల నోటి నుండి ఇలాంటి మాటలా.. తప్పు చిన్నా అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక బ్రో సినిమా నిర్మాత అమెరికా నుంచి బ్లాక్ మనీని తెచ్చి ఇక్కడ వైట్ మనీగా మారుస్తున్నారని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అమెరికాలో ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు డబ్బులు కలెక్ట్ చేసి విశ్వప్రసాద్‌కు ఇస్తే.. ఆ డబ్బును ఇండియాకు తెచ్చి పవన్ కళ్యాణ్‌కు పారితోషికం రూపంలో ఇచ్చారని అన్నారు. నిజానికి ఇది పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు ఇవ్వాల్సిన ప్యాకేజీ డబ్బు అని.. దాన్నే విశ్వప్రసాద్ ద్వారా రెమ్యునరేషన్ రూపంలో ఇచ్చారని ఆరోపించారు. అయితే, అంబటి రాంబాబు ఆరోపణలపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ స్పందిస్తూ తనకి సంస్కారం ఉందని తప్పుగా మాట్లాడలేనని అన్నారు.ఎవరికి తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…